Breaking News
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌. జిల్లాలోని 9 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌. జనగాం, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్‌.. వర్ధన్నపేట, డోర్నకల్‌, తొర్రూర్‌, మరిపెడలో టీఆర్‌ఎస్‌ విజయం. జనగాం: టీఆర్‌ఎస్‌-13, కాంగ్రెస్‌-10, బీజేపీ-4, ఇతరులు-3. భూపాలపల్లి: టీఆర్‌ఎస్‌-23, బీజేపీ-1, ఇతరులు-6. పరకాల: టీఆర్‌ఎస్‌-17, బీజేపీ-3, కాంగ్రెస్‌-1, ఇతరులు-1. నర్సంపేట: టీఆర్‌ఎస్‌-16, కాంగ్రెస్‌-6, ఇతరులు-2. తొర్రూరు: టీఆర్‌ఎస్‌-12, కాంగ్రెస్‌-3, బీజేపీ-1. వర్ధన్నపేట: టీఆర్‌ఎస్‌-8, కాంగ్రెస్‌-2, బీజేపీ-1, ఇతరులు-1. డోర్నకల్‌: టీఆర్‌ఎస్‌-11, కాంగ్రెస్‌-1, ఇతరులు-3. మహబూబాబాద్‌: టీఆర్ఎస్‌-19, కాంగ్రెస్‌-10, ఇతరులు-7. మరిపెడ: టీఆర్‌ఎస్‌-15.
  • రైతులపై దాడి చేయించిన జగన్‌ రైతు ద్రోహిగా మరింత దిగజారారు. మూడు రాజధానుల్లో ఆయన స్వార్థం తప్ప రాజధానులు లేవని.. ప్రజలకు అర్థమైందన్న ఆందోళన జగన్‌ను వెంటాడుతోంది-లోకేష్‌. వైసీపీ రౌడీలను రంగంలోకి దింపి జేఏసీ శిబిరానికి నిప్పంటించారు. తెనాలిలో వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం-నారా లోకేష్‌. జగన్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరూ లేరు-ట్విట్టర్‌లో నారా లోకేష్‌.
  • చిత్తూరు: గ్రేడ్‌-3 మున్సిపాలిటీగా కుప్పం గ్రామ పంచాయతీ. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం. ఏడు గ్రామపంచాయతీలను కుప్పం మున్సిపాలిటీలో విలీనం. కుప్పం మున్సిపాలిటీలో చీలేపల్లి, దళవాయి కొత్తపల్లి, చీమనాయనపల్లి.. సామగుట్టపల్లి, తంబిగానిపల్లి, కమతమూరు, అనిమిగానిపల్లి విలీనం. చంద్రబాబు నియోజకవర్గానికి మున్సిపాలిటీ హోదా కల్పించిన ప్రభుత్వం.
  • కరీంనగర్‌: తిమ్మాపూర్‌ దగ్గర ఎస్సారెస్పీ కెనాల్‌లో కారు బోల్తా. కారులో ఉన్న దంపతులు మృతి. మృతులు సుల్తానాబాద్‌ వాసులుగా గుర్తింపు.
  • విశాఖ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా హై అలర్ట్. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు భద్రత పెంపు.

బెంగళూరు ఘటన.. ఐదుగురి అరెస్ట్

Neighbours arrested after Bengaluru man kills son, బెంగళూరు ఘటన.. ఐదుగురి అరెస్ట్

బెంగళూరులో సోమవారం సంచలనం సృష్టించిన మర్డర్ కేసులో పోలీసులు ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుల బాధలు భరించలేక సురేశ్ అనే వ్యక్తి తన 12ఏళ్ల కుమారుడిని ఉరేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన భార్య గీతాభాయి కూడా ఆత్మహత్య చేసుకొని కన్నుమూసింది. ఇక ఈ కేసును విచారిస్తున్న పోలీసులు తాజాగా ఐదుగురిని అరెస్ట్ చేశారు.

ఇటీవల చీటీల వ్యాపారంలో నష్టాలు రావడంతో.. తమ డబ్బును వడ్డీతో సహా ఇవ్వాలంటూ రమేశ్ కుటుంబంపై కొందరు ఒత్తిడి తీసుకొచ్చారు. వారిలో ఇంటిపక్కల వారు కూడా ఉన్నారు. వారి చర్య వలనే ఆత్మహత్య చేసుకోవాలని రమేశ్ కుటుంబం భావించిందని పోలీసులు నిర్దారణకు వచ్చారు. దీంతో ఐదు మందిని అరెస్ట్ చేశారు. దీనిపై స్థానిక పోలీస్ అధికారి అబ్దుల్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం. మరో ఇద్దరు, ముగ్గురిని త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ పేర్కొన్నారు. కాగా ఇదే కేసులో ఓ జర్నలిస్ట్‌పై పోలీసులు కేసు నమోదు చేశాయి. గీతాభాయి అంత్యక్రియల సమయంలో రమేశ్ బాబు ఫోన్‌ను తీసుకున్న జర్నలిస్ట్.. అందులో కొన్ని వీడియోలను పలువురికి షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో అతడిపై కూడా కేసు నమోదైంది.