Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • సిద్దిపేట: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి కేసిఆర్ నేడు ప్రారంబించనున్నారు .. కార్యక్రమానికి హాజరుకానున్న చిన జీయర్ స్వామి..
  • నేడు మరో రెండు పిటిషన్లపై విచారణ.. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు విచారణ.. ఇప్పటికే 49 మంది కి నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. ఎల్జి పాలిమర్స్ కేసును విచారించిన ధర్మాసనం.
  • మహారాష్ట్ర లో కరోనా విలయతాండవం. మహారాష్ట్ర లో ఈరోజు 2598 కరోనా పాజిటివ్ కేస్ లు,85 మంది మృతి. మహారాష్ట్ర రాష్ట్రంలో 59546 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. 1982 మంది మృతి.
  • అమరావతి: ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పిటిషన్ పై తీర్పు. ఏపీ ప్రభుత్వానికి SEC విషయంలో హైకోర్టు షాక్. SECగా నిమ్మగడ్డ ను విధుల్లోకి తీసుకోవాలన్న ఏపీ హైకోర్టు. నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ కొట్టేసిన ఏపీ హైకోర్టు. వెంటనే నిమ్మగడ్డను విధుల్లోకి తీసువాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు.
  • అచ్చెన్నాయుడు, టీడీఎల్పీ ఉప నేత. నిమ్మగడ్డ రమేశ్ ను ఈసీ గా కొనదగించాలని. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఇప్పటికయినా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. కరోనా తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఈ సమయంలో కక్ష సాధింపు రాజకీయాలా.

‘మహానటి’ని వద్దంటోన్న మహేష్‌ ఫ్యాన్స్‌.. ఎందుకంటే..!

హీరోలకే కాదు వారి ఫ్యాన్స్‌లకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఫ్యాన్స్‌ చాలా సెంటిమెంట్లను నమ్ముతుంటారు. ఇప్పుడు అలాంటి ఓ సెంటిమెంట్‌ను
Negativity on Keerthy Suresh, ‘మహానటి’ని వద్దంటోన్న మహేష్‌ ఫ్యాన్స్‌.. ఎందుకంటే..!

హీరోలకే కాదు వారి ఫ్యాన్స్‌లకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఫ్యాన్స్‌ చాలా సెంటిమెంట్లను నమ్ముతుంటారు. ఇప్పుడు అలాంటి ఓ సెంటిమెంట్‌ను నమ్ముతోన్న మహేష్‌ ఫ్యాన్స్‌, తమ ఫేవరెట్ స్టార్ సరసన మహానటి కీర్తి సురేష్‌ వద్దంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా గీత గోవిందం ఫేమ్‌ పరశురామ్ దర్శకత్వంలో మహేష్‌ తదుపరి చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌ కీర్తి వద్దంటూ హీరోను అభ్యర్థిస్తున్నారు. పెద్ద హీరోల సరసన కీర్తి సురేష్‌ నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయని.. అందుకే మహేష్ సరసన వద్దంటూ వారు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఈ మూవీ కోసం కియారాను తీసుకోవాలని వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. కాగా ఫ్యాన్స్‌ నుంచి వచ్చే అభ్యంతరాలను తరచుగా పట్టించుకునే మహేష్.. ఈ విషయంలో ఆలోచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌ను సంప్రదించాలని దర్శకనిర్మాతలకు సూపర్‌స్టార్ సూచించినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? మహేష్‌ సరసన ఎవరు నటించబోతున్నారు..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: నీ వల్లే ప్రేమంటే ఏంటో తెలిసింది.. బన్నీ భావోద్వేగ ట్వీట్..!

Related Tags