అచ్చం ఏనుగులా ఉన్న కొండ‌.. వైర‌ల్ అవుతోన్న ఫొటో

అచ్చం ఏనుగులా ఉన్న కొండ ఒక‌టి సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. ఏనుగు ఆకారంలో ఉన్న నీడిల్ హోల్ పాయింట్ అనే కొండ ఫొటో అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంటూండంతో దాన్ని నెటిజ‌న్స్ షేర్ చేస్తున్నారు. ఇది మ‌హారాష్ట్ర‌లోని మ‌హాబ‌లేశ్వ‌ర్..

అచ్చం ఏనుగులా ఉన్న కొండ‌.. వైర‌ల్ అవుతోన్న ఫొటో
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2020 | 7:50 PM

అచ్చం ఏనుగులా ఉన్న కొండ ఒక‌టి సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. ఏనుగు ఆకారంలో ఉన్న నీడిల్ హోల్ పాయింట్ అనే కొండ ఫొటో అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంటూండంతో దాన్ని నెటిజ‌న్స్ షేర్ చేస్తున్నారు. ఇది మ‌హారాష్ట్ర‌లోని మ‌హాబ‌లేశ్వ‌ర్ స‌మీపంలో ఉంది. నీడిల్ హోల్ పాయింట్ అనేది స‌హ‌జ‌మైన రాతి నిర్మాణం. దాని మ‌ధ్య రంధ్రం ఉంది. అది ఏనుగు తొండాన్ని పోలి ఉంది. దీనిని ఎలిఫెంట్ హెడ్ పాయింట్ అని కూడా అంటారు. ఈ ఫొటోను చూసి అంద‌రూ వావ్ అంటూ కామెంట్స్ చేస్తూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఏనుగుల సంర‌క్ష‌ణ కోసం ప్ర‌తీ ఏటా ఆగ‌ష్టు 12న వ‌ర‌ల్డ్ ఎలిఫెంట్ డే నిర్వ‌హిస్తారు. దీంతో నెటిజ‌న్లు ఈ రోజును పుర‌స్క‌రించుకొని సోష‌ల్ మీడియాలో ఏనుగు ఆకారంలో ఉన్న కొండ ఫొటోలు, వీడియోల‌ను పంచుకున్నారు. ఏనుగుల‌పై క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రించ‌కుండా, వాటిని సంర‌క్షించుకుందామ‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read More:

ప‌నికి రావ‌డం లేద‌ని 12 ఏళ్ల బాలుడిని చావ‌గొట్టిన య‌జ‌మాని

క‌రోనా నుంచి కోలుకున్న డైరెక్ట‌ర్‌ రాజ‌మౌళి కుటుంబం

దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు, క‌ర్నాట‌క‌కి ఎల్లో అలెర్ట్