మీరు కూరగాయల్ని కడిగే తింటున్నారా..?

తాజా పండ్లు, కూరగాయలపై పర్యావరణ వర్కింగ్ గ్రూప్ ఇయర్ డర్టీ డజన్‌కు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇందులో చాలా ఆశ్చరకరమైన విషయాలు వెల్లడయ్యాయి. 90 శాతం కూరగాయల్లో పురుగుమందులు ఉన్నట్లు ఈ సంస్థ గుర్తించింది. కడగకుండా వీటిని వండుకుని తినడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు. పర్యావరణ వర్కింగ్ గ్రూప్ ఇయర్ డర్టీ డజన్ కనుగొన్న దాని ప్రకారం పండ్లు, కూరగాయలపై విషపూరితమైన బాక్టీరియా ఉందని వెల్లడించారు. అందులో ముఖ్యంగా స్ట్రాబెర్రీస్, […]

మీరు కూరగాయల్ని కడిగే తింటున్నారా..?
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 21, 2019 | 4:05 PM

తాజా పండ్లు, కూరగాయలపై పర్యావరణ వర్కింగ్ గ్రూప్ ఇయర్ డర్టీ డజన్‌కు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇందులో చాలా ఆశ్చరకరమైన విషయాలు వెల్లడయ్యాయి. 90 శాతం కూరగాయల్లో పురుగుమందులు ఉన్నట్లు ఈ సంస్థ గుర్తించింది. కడగకుండా వీటిని వండుకుని తినడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు.

పర్యావరణ వర్కింగ్ గ్రూప్ ఇయర్ డర్టీ డజన్ కనుగొన్న దాని ప్రకారం పండ్లు, కూరగాయలపై విషపూరితమైన బాక్టీరియా ఉందని వెల్లడించారు. అందులో ముఖ్యంగా స్ట్రాబెర్రీస్, పాలకూర, కాలే అత్యధికంగా మొదటి మూడు జాబితాలో ఉన్నాయని చెప్పారు. కాగా.. అవోకాడోస్, స్వీట్ కార్న్, పైనాపిల్‌లో చాలా తక్కువ మొత్తంలో బాక్టీరియా ఉందని తెలిపారు శాస్త్రవేత్తలు. దాదాపు ఒక దశాబ్ధంలో కాలే ఫస్ట్ టైం మొదటిసారి డర్టీ డజన్ జాబితాలో కనిపించడం శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తుంది. కాగా.. వీటిల్లో ఎక్కువగా పురుగు మందుల అవశేషాలు కనిపించాయని కొనుగొన్నారు. లాస్ట్ టైం కాలే ఆకుకూర 12వ ప్లేస్‌లో ఉందని చెప్పారు.

అలాగే.. కాలే ఆకుకూరని టెస్ట్ చేయగా అందులో 18 రకాలైన బ్యాక్టీరియా ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా.. 2009లో ఐరోపాలో నిషేదించబడిన ఒక జాతికి చెందిన ద్రాక్షపై పరిశోధనలు చేయగా అందులో.. 60శాతం బ్యాక్టీరియా ఉన్నట్టు చెప్పారు. ఈ కొత్త డేడాతో కాలేను యూఎస్‌డీఏ చేత పరీక్షించకుండా, మెట్రిక్స్‌లలో చూశామని తెలిపారు శాస్త్రవేత్తలు. కాలేలో పెరిగే బ్యాక్టీరియా చూసి ఆశ్చర్యపోయామని EWGలో టాక్సికాలజిస్ట్ డాక్టర్ అలెక్సిస్ టెంక్కిన్ ఒక వెబ్‌సైట్‌కు వెల్లడించారు.

అంతేకాకుండా స్ట్రాబెర్రీస్‌లలో కొన్ని రకాల జాతులకు చెందిన వాటిపై కూడా టెస్ట్‌లు నిర్వహించగా.. వీటిలో ఒక శాతం బ్యాక్టీరియా ఉందని పేర్కొన్నారు. అలాగే యాపిల్స్‌లలో కూడా. డర్టీ సంస్థ తయారు చేసిన జాబితా ప్రకారం ఉత్పత్తులపై కనిపించే పురుగుమందులన్నీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ రూపొందించిన చట్టపరమైన పరిమితులకు లోబడి ఉందని పేర్కొంది.

ఈ రకమైన విషపూరితమైన పండ్లు, కూరగాయాలు తినడం వల్ల క్యాన్సర్‌కు దారితీస్తుందని లిబా అనే శాస్త్రవేత్త చెప్పారు. కానీ.. మనం మంచి ఆహారం తినాలనుకుంటే సేంద్రీయ పద్దతుల ద్వారా పండించిన ఆహారం తినడం వల్ల అనేక రకమైన ఆరోగ్య అపాయాలను తగ్గిస్తుందని కనుగొన్నారు. అలాగే.. కూరగాయాలను కడిగి తినడం వల్ల కూడా బ్యాక్టీరియాల శాతం తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

హార్వర్డ్ TH చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జనవరి 2018లో జరిపిన సర్వే ప్రకారం బ్యాక్టీరియా ఉన్న ఉత్పత్తులను తినడం వల్ల స్త్రీలు ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్‌కు గురి కావాల్సి వస్తుందని కనుగొన్నారు. కాగా.. అనేక ఫ్రెంచ్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించిన డిసెంబర్ 2018 అధ్యయనం సేంద్రీయ ఆహారాలు తినేవారు క్యాన్సర్ బారి నుండి పడే వీలుందని పేర్కొన్నారు.

బ్యాక్టీరియా అనేక అనారోగ్య ప్రభావాలను కలిగి ఉంటాయి, అవి చర్మాన్ని, కళ్ళను, నాడీ వ్యవస్థను హాని చేస్తాయిని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ బ్యాక్టీరియా పిల్లల మెదడుపై అవి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని పేర్కొన్నారు.