విరాట్, ఎన్టీఆర్‌తో.. ఓ యాడ్ షూట్?

NTR Virat Kohli, విరాట్, ఎన్టీఆర్‌తో.. ఓ యాడ్ షూట్?

భారత్ క్రికెట్ టీం సారధి విరాట్ కోహ్లీ, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఓ యాడ్ కు పనిచేయనున్నారనే వార్తలు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారమవుతున్నాయి. ప్రముఖ జాతీయ టీవీ ఛానల్ ఎన్డీటీవీ వారు ‘రోడ్ అండ్ ఆల్కాహాల్ అవేర్ నెస్ ప్రోగ్రామ్’ను ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇందులో ఎన్టీఆర్.. విరాట్ కోహ్లీ భాగస్వాములు కానున్నారట.

డ్రంక్ డ్రైవింగ్ వల్ల కలిగే నష్టాలు, రోడ్ సేఫ్టీ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రాం ఉద్దేశం అని తెలుస్తోంది. దీనిలో ఎన్టీఆర్.. విరాట్ కోహ్లీతో పాటు వివిధ రంగాలకు చెందిన ఏడుగురు సెలబ్రిటీస్ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారట. ఈ యాడ్ గురించి మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఎన్టీఆర్.. విరాట్ కోహ్లీను ఒకేసారి కనిపిస్తుండటంతో అందరి దృష్టిని ఈ ప్రోగ్రాం ఆకర్షిస్తుందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *