మరో ఆరుగురు ఉంటే.. రాజ్య సభలో ఎన్డీయే కి రిలీఫ్

235 మంది సభ్యులతో కూడిన రాజ్యసభలో ఎన్డీయే బలం ఆదివారం నాటికి 111 ఉంది. అప్పటికి ఇంకా పది ఖాళీలున్నాయి. కొత్తగా బీజీపీలో నలుగురు టీడీపీ ఎంపీలు, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కు చెందిన ఒకరు చేరిపోవడంతో ఈ సంఖ్య ఈ నెల 5 నాటికి 115 కు పెరుగుతుంది. అంటే ఆ రోజుకు మరో ఆరుగురు సభ్యులు మాత్రమే తక్కువవుతున్నారు. కాగా-ఎగువసభలో బిల్లుల ఆమోదం పొందాలంటే టీఆర్ఎస్, బీజేడీ, వైసీపీ వంటి తటస్థ పార్టీల […]

మరో ఆరుగురు ఉంటే.. రాజ్య సభలో ఎన్డీయే కి రిలీఫ్
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 01, 2019 | 7:42 PM

235 మంది సభ్యులతో కూడిన రాజ్యసభలో ఎన్డీయే బలం ఆదివారం నాటికి 111 ఉంది. అప్పటికి ఇంకా పది ఖాళీలున్నాయి. కొత్తగా బీజీపీలో నలుగురు టీడీపీ ఎంపీలు, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కు చెందిన ఒకరు చేరిపోవడంతో ఈ సంఖ్య ఈ నెల 5 నాటికి 115 కు పెరుగుతుంది. అంటే ఆ రోజుకు మరో ఆరుగురు సభ్యులు మాత్రమే తక్కువవుతున్నారు. కాగా-ఎగువసభలో బిల్లుల ఆమోదం పొందాలంటే టీఆర్ఎస్, బీజేడీ, వైసీపీ వంటి తటస్థ పార్టీల మద్దతు ఉంటుంది గనుక బీజేపీకి పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ పార్టీల్లో టీఆర్ఎస్ నుంచి ఆరుగురు, బీజేడీ నుంచి ఐదుగురు, వైసీపీ నుంచి ఇద్దరు, ఎన్ పీ ఎఫ్ నుంచి ఒకరు మొత్తం 14 మంది సభ్యులున్నారు. 12 మంది నామినేటెడ్ ఎంపీల్లో ఎనిమిది మంది కమలం పార్టీలో చేరిపోయారు. ఈ పరిస్థితిలో బిల్లుల ఆమోదం పొందడం పెద్ద కష్టమేమీ కాదని, అయితే కాంగ్రెస్ వంటి పార్టీలతోనే చిక్కని కమలనాథులు అంటున్నారు. ఆ మధ్యకాలంలో రాజ్యసభలో ఈ పార్టీకి మెజారిటీ లేకపోవడంతో ప్రతిపక్షాలు అధికారిక బిల్లులకు సవరణల కోసం పట్టుబడుతూ వఛ్చిన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి కూడా సవరణలు కోరేవి. ప్రస్తుతం త్రిపుల్ తలాక్ బిల్లు వంటి కొన్ని ‘ క్లిష్టమైన ‘ బిల్లులు ఎగువ సభ ఆమోదం కోసం వేచి ఉన్నాయి. బీజేడీ, వైసీపీ, ఎంఐఎం వంటి పార్టీలు అత్యంత ప్రధానమైన ట్రిపుల్ తలాక్ బిల్లుకు సవరణలు కోరుతున్నాయి. ఈ బిల్లు పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అటు-కాంగ్రెస్ పార్టీకూడా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. జులై 5 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ముఖ్యంగా ఎగువసభ గురించే కమలం పార్టీ వర్రీ అవుతోంది. అయితే ఎటూ తటస్థ పార్టీలు కొన్ని ఉన్నాయిగనుక ‘ గుండె నిబ్బరం ‘ తో వ్యవహరిస్తోంది.