బీహార్ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తాం, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా( కలిసికట్టుగా) తాము పోటీ చేస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఎన్డీయే లోని భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయని ఆయన చెప్పారు. సీఎం  నితీష్ కుమార్ నేతృత్వంలో..

బీహార్ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తాం, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2020 | 11:04 AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా( కలిసికట్టుగా) తాము పోటీ చేస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఎన్డీయే లోని భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయని ఆయన చెప్పారు. సీఎం  నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యు ఈ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.వచ్ఛేనెల  28 నుంచి నవంబర్ 7 వరకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10 న ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో జేడీ-యూ, చిరాగ్ పాశ్వాన్ ఆధ్వర్యం లోని ఎల్ జీపీ కొంతకాలంగా ఎడమొహం, పెడ మొహంగా ఉంటున్నాయి. జేడీయూపై తాము అభ్యర్థులను నిలబెడతామని ఎల్ జీపీ తెలిపింది. దీంతో బీహార్ లో ఎన్డీయే కి విచిత్రమైన సంకట పరిస్థితి తలెత్తింది.