డ్రగ్స్ కేసులో ఎన్సీపీ నేత అల్లుడి అరెస్ట్, చట్టానికి ఎవరూ అతీతులు కారు, జుడీషియరీ పట్ల నమ్మకం ఉందన్న నవాబ్ మాలిక్

డ్రగ్స్ కేసులో తన అల్లుడు సమీర్ ఖాన్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేయడాన్ని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సమర్థించారు.

  • Umakanth Rao
  • Publish Date - 5:04 pm, Thu, 14 January 21

డ్రగ్స్ కేసులో తన అల్లుడు సమీర్ ఖాన్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేయడాన్ని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సమర్థించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరగాలని ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని, జుడీషియరీ పట్ల తనకు విశ్వాసం ఉందని ఆయన ట్వీట్ చేశారు.  డ్రగ్స్ కేసుకు సంబంధించి ముంబై లోని బాంద్రాలో సమీర్ ఖాన్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సిబ్బంది అరెస్టు చేసి అతనిసెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. కొందరు మాదకద్రవ్య సప్లయర్లకు, ఇతనికి లింక్ ఉందని వారు భావిస్తున్నారు. అతని సెల్ ఫోన్ ని ఫోరెన్సిక్ విభాగానికి పంపారు. సమీర్ ఖాన్ మరో ఇద్దరు రాజకీయ నేతలతో కూడా మాట్లాడాడని భావిస్తున్న అధికారులు అతని వాట్సాప్ సంభాషణలను విశ్లేషిస్తున్నారు. అటు-నటుడు అర్జున్ రాంపాల్ సోదరి కోమల్ రాంపాల్ ను కూడా అధికారులు ఈ నెల 12 న విచారించారు.

బాలీవుడ్ లో మళ్ళీ డ్రగ్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. అయితే బడా బాబులు మాత్రం తప్పించుకుపోతున్నారు.