‘ నువ్వు పోలీసువా ? అయితే ఐడెంటిటీ కార్డు చూపు ‘ !

ముంబై హాట్ హాట్ పాలిటిక్స్ లో ఇదో ‘ ఖాకీ ‘ మరక ! తమ ఎమ్మెల్యేలు ఎవరినీ బీజేపీ ప్రలోభపెట్టకుండా చూసేందుకు శరద్ నేతృత్వంలోని ఎన్సీపీతో బాటు కాంగ్రెస్, సేన పార్టీలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఆదివారం సాయంత్రం నగరంలోని రిజైనాన్స్ హోటల్లో 50 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ‘ మోహరించిన వేళ’.. ఓ సీనియర్ పోలీసు అధికారి సాదా దుస్తుల్లో (మఫ్టీలో) ఓ సీట్లో కూర్చున్నాడు. ఇది చూసిన జితేంద్ర ఆహద్ అనే శాసన […]

' నువ్వు పోలీసువా ? అయితే ఐడెంటిటీ కార్డు చూపు ' !
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 12:36 PM

ముంబై హాట్ హాట్ పాలిటిక్స్ లో ఇదో ‘ ఖాకీ ‘ మరక ! తమ ఎమ్మెల్యేలు ఎవరినీ బీజేపీ ప్రలోభపెట్టకుండా చూసేందుకు శరద్ నేతృత్వంలోని ఎన్సీపీతో బాటు కాంగ్రెస్, సేన పార్టీలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఆదివారం సాయంత్రం నగరంలోని రిజైనాన్స్ హోటల్లో 50 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ‘ మోహరించిన వేళ’.. ఓ సీనియర్ పోలీసు అధికారి సాదా దుస్తుల్లో (మఫ్టీలో) ఓ సీట్లో కూర్చున్నాడు. ఇది చూసిన జితేంద్ర ఆహద్ అనే శాసన సభ్యుడు అతనివద్దకు వచ్చి.. ‘ ఎవరు మీరు ? ఇక్కడేం చేస్తున్నారు ‘ అని ప్రశ్నించగా.. తనో పోలీసు అధికారినని, కేవలం ఇక్కడ కూర్చున్నానని ‘ ఆయన చెప్పాడు. అయితే మీ ఐడెంటిటీ కార్డు చూపాలని జితేంద్ర కోరారు. ఆలోగా ఇతర ఎమ్మెల్యేలంతా అక్కడ గుమికూడారు. సదరు పోలీసు చేసేది లేక కామ్ గా తన ఐడెంటిటీ కార్డు తీసి ఇచ్చాడు. తనతో బాటు ఎమ్మెల్యేలంతా దాన్ని చూశాకకూడా .. జితేంద్ర శాంతించలేదు. అసలు ఓ పోలీసాయన ఇక్కడెందుకు ఉన్నాడని, మేమేమైనా మూర్హులమనుకుంటున్నారా ‘ అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించాడు.

కాగా-ఆదివారం అర్ధరాత్రి సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జరిపిన మంతనాలు హాట్ టాపిక్ గా మారాయి. ఉన్నట్టుండి అర్ధరాత్రి వేళ వీరు హఠాత్తుగా చర్చలు జరపడం సస్పెన్స్ కు తెర లేపింది. అయితే తాము రైతు సమస్యలపైనే చర్చించామని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. కానీ.. ఎన్సీపీ అధినేత శరద్ పవారే తమ నేత అని, తాను ఎన్సీపీలోనే కొనసాగుతున్నానని అజిత్ ఆదివారం సాయంత్రం చేసిన ట్వీట్ బీజేపీలో ‘ ముసలం,’ లేపినట్టుంది. దీంతో ముఖ్యంగా ఫడ్నవీస్ రంగంలోకి దిగక తప్పలేదు.