టాటా బోర్డుకు షాక్.. సైరస్ మిస్త్రీకి లైన్ క్లియర్

టాటా బోర్డుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. సైరస్ మిస్త్రీ మళ్లీ టాటా గ్రూపు సీఈవోగా పగ్గాలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం టాటా సంస్థ ఎగ్జిగ్యూటివ్ ఛైర్మన్‌ పదవిలో ఉన్న నటరాజన్ చంద్రశేఖర్‌ నియమాకం అక్రమమైందన్న లా ట్రిబ్యునల్.. మిస్త్రీకే మళ్లీ ఎగ్జిగ్యూటివ్ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించాలని తేల్చింది. ఈ వ్యవహారంలో దిగువ కోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టిన లా ట్రిబ్యునల్.. టాటా సన్స్ సంస్థను ప్రభుత్వ సంస్థ నుంచి ప్రైవేట్ సంస్థగా […]

టాటా బోర్డుకు షాక్.. సైరస్ మిస్త్రీకి లైన్ క్లియర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 18, 2019 | 7:53 PM

టాటా బోర్డుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. సైరస్ మిస్త్రీ మళ్లీ టాటా గ్రూపు సీఈవోగా పగ్గాలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం టాటా సంస్థ ఎగ్జిగ్యూటివ్ ఛైర్మన్‌ పదవిలో ఉన్న నటరాజన్ చంద్రశేఖర్‌ నియమాకం అక్రమమైందన్న లా ట్రిబ్యునల్.. మిస్త్రీకే మళ్లీ ఎగ్జిగ్యూటివ్ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించాలని తేల్చింది. ఈ వ్యవహారంలో దిగువ కోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టిన లా ట్రిబ్యునల్.. టాటా సన్స్ సంస్థను ప్రభుత్వ సంస్థ నుంచి ప్రైవేట్ సంస్థగా మార్చడాన్ని కూడా రద్దు చేసింది.

అయితే షాపూర్ పల్లోంజీ కుటుంబానికి చెందిన మిస్త్రీ టాటా గ్రూపులో 10శాతం వాటాను కలిగి ఉన్నారు. ఆ సంస్థలో అతి పెద్ద హోల్డర్‌ కూడా ఆయనదే. ఇక 2012లో టాటా సన్స్ ఛైర్మన్‌గా రతన్ టాటా వైదొలగడంతో.. మిస్త్రీ ఆ బాధ్యతలు చేపట్టారు. అయితే కొన్ని కారణాల వలన 2014 అక్టోబర్‌లో మిస్త్రీని టాటా బోర్డు ప్రతినిథులు సీఈవో పదవి నుంచి తొలగించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా తనను తొలగించారని ఆరోపించిన మిస్త్రీ.. అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. ఇక తాజాగా లా ట్రిబ్యునల్ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. త్వరలోనే టాటా సంస్థల సీఈవోగా మిస్త్రీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.