Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • కరోనా తోచనిపోయిన మృతదేహాలను మతంతో సంబంధం లేకుండా దహనం చేయాలి. ఖననం(పూడ్చి పెట్టడం) అనుమతించబడదు. అంత్యక్రియలకు 5 మందికి మించి ఉండకూడదు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ పర్దేషి.

అయోధ్య తీర్పు: చేయకూడనివి ఏంటంటే..?

NBSA issues advisory regarding Ayodhya verdict, అయోధ్య తీర్పు: చేయకూడనివి ఏంటంటే..?

వివాదస్పద అయోధ్య రామజన్మభూమిపై మరికొన్ని గంటల్లో సుప్రీం తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. అయోధ్య తీర్పు నేపథ్యంలో న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ పలు సూచనలు చేసింది.

తీర్పు నేపథ్యంలో వార్తా ప్రసార మాధ్యమాలు చేయకూడనివి..

*తీర్పుకు ముందు.. అది ఎలా ఉండొచ్చు అని ఊహాజనిత వ్యాఖ్యలు ఉండరాదు.
* తీర్పు తర్వాత.. ఎలాంటి రెచ్చగొట్టే పదాలు కానీ, వ్యాఖ్యలు కానీ చేయకూడదు.
* బాబ్రీ మసీదు కూల్చివేత దృశ్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
* తీర్పు తర్వాత నిరసనలు…సంబరాలకు సంబంధించిన వాటిని చూపించకూడదు.
* మతపరమైన అంశాల ప్రస్తావన విషయంలో.. అత్యంత జాగ్రత్త వహించాలి.
* తీర్పుని.. తీర్పులా చెప్పాలి తప్ప.. ఉపమానాలు, ఉపమేయాలు వాడకూడదు.
* తీర్పునకు సంబంధించి.. న్యాయమూర్తులపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదు.
* తీర్పుపై రెచ్చగొట్టే విధంగా ఎలాంటి ప్రసారాలు చేయరాదు.

శాంతి భద్రతల దృష్ట్యా..కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు..బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ  ఈ సూచనలు చేసింది. అందుకు న్యూస్ ఛానల్స్, వార్తా పత్రికలు సహరించాలని కోరింది.

Related Tags