10కోట్ల రెమ్యునరేషన్.. అయినా ఆ సినిమా చేయనందట

10కోట్లు.. దక్షిణాదిన ఏ హీరోయిన్‌కు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వరు. అలాంటిది లేడి సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతారకు ఇచ్చేందుకు ఒక సినిమా నిర్మాతలు భావించారట. కానీ ఆ ఆఫర్‌ను మాత్రం ఆమె సున్నితంగా తిరస్కరించిందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త ఒకటి కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.

వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న నయనతారను ఒక సినిమాకు ఒప్పించాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. ఎందుకంటే తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అది ఎంత పెద్ద హీరో అయినా అందులో నటించేందుకు ఆమె ఒప్పుకోదు. ఇలా కొన్ని సినిమాలను కూడా ఆమె వదులుకుంది. అయితే తాజాగా ఆమెకు ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట. ప్రముఖ శరవణన్ షోరూం యజమాని లెజండ్ శరవణన్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతారను అడిగారట చిత్ర యూనిట్. ప్రస్తుతం ఆమె దాదాపు 5కోట్లు తీసుకుంటుండగా.. దానికి రెట్టింపు 10కోట్ల ఇస్తామని చెప్పారట. కానీ అందుకు నయన్ ఒప్పుకోలేదట. అతడు కనీసం పేరు మోసిన హీరో కాకపోవడంతోనే ఆ సినిమాలో నటించేందుకు ఆమె ఒప్పుకోలేదని సమాచారం. మరోవైపు ఈ ఏడాది ఆమెకు విశ్వాసం ఒక్కటే విజయాన్ని ఇచ్చింది. ఆ తరువాత వచ్చిన ఐరా, మిస్టర్ లోకల్ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దీంతో స్క్రిప్ట్‌లపైనే ఫోకస్‌ పెట్టిన నయన్.. శరవణన్ చిత్రంలో తగిన పాత్ర లేదని ఒప్పుకోలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నయనతార తమిళ్‌లో రజనీ సరసన దర్బార్.. విజయ్ సరసన బిగిల్‌లో నటిస్తోంది. ఇందులో బిగిల్ చిత్రం దీపావళికి రానుండగా.. దర్బార్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆమె నటిస్తోన్న సైరా నరసింహారెడ్డి అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *