నయనతార.. ఇది నిజమేనా..!

వరుస హిట్లు.. అత్యధిక పారితోషికంతో దక్షిణాదిన లేడి సూపర్‌స్టార్‌గా చలామణి అవుతోంది నయనతార. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. సినిమాల గురించి పక్కనపెడితే నయనతార పెళ్లికి సిద్ధమౌతోందన్న వార్త ఇప్పుడు అటు కోలీవుడ్‌లో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో డీప్ లవ్‌లో ఉన్న నయన్.. త్వరలో అతడిని పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది.

త్వరలో బంధుమిత్రుల సమక్షంలో ఆమె ఎంగేజ్‌మెంట్ జరుపుకొని, వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నయన్, విఘ్నేశ్ ఇరు కుటుంబాల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండటంతోనే వారు ఈ నిర్ణయానికి వచ్చారని కోలీవుడ్‌లో పలువురు మాట్లాడుకుంటున్నారు.

అయితే కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి నయన్ మూడు సార్లు ప్రేమలో పడింది. నటుడు శింబు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, ఇప్పుడు దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఆ లిస్ట్‌లో ఉన్నారు. వారిలో శింబుతో ప్రేమ వరకు మాత్రమే సాగగా.. ప్రభుదేవాతో వివాహం వరకు వెళ్లింది. అయితే కొన్ని కారణాల వలన పెళ్లి పీటలెక్కకముందే ఆ బంధం ముగిసిపోయింది. ఇక నాలుగు సంవత్సరాల నుంచి విఘ్నేశ్ శివన్‌తో నయన్ డేటింగ్ చేస్తుండగా.. ఇప్పుడు మరోసారి పెళ్లి వార్తల్లో నిలిచింది. మరి ఎంగేజ్‌మెంట్ వార్తలపై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *