జార్ఖాండ్‌లో 16 వాహనాలకు నిప్పుపెట్టిన నక్సల్స్

జార్ఖాండ్‌లోని లతెహార్ జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి తెగించారు. టోరి రైల్వే సైడింగ్ వద్ద 16 వాహనాలకు నిప్పుపెట్టారు. అక్కడే నిద్రిస్తున్న ఆరుగురు కార్మికులపై దాడి చేశారు. జార్ఘాండ్ జనముక్తి పరిషత్‌కు చెందిన మావోయిస్టులు గత రాత్రి ఈ పనికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. తొలుత తోరి రైల్వే సైడింగ్‌పై దాడి చేసిన మావోయిస్టులు, అక్కడ నిద్రలో ఉన్న కార్మికులపై విరుచుకుపడ్డారని, వారి మొబైల్స్ ఎత్తుకెళ్లడంతో పాటు సైడింగ్ వద్ద నిలిపి ఉంచిన 16 వాహనాలకు నిప్పుపెట్టి […]

జార్ఖాండ్‌లో 16 వాహనాలకు నిప్పుపెట్టిన నక్సల్స్
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2019 | 6:47 PM

జార్ఖాండ్‌లోని లతెహార్ జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి తెగించారు. టోరి రైల్వే సైడింగ్ వద్ద 16 వాహనాలకు నిప్పుపెట్టారు. అక్కడే నిద్రిస్తున్న ఆరుగురు కార్మికులపై దాడి చేశారు. జార్ఘాండ్ జనముక్తి పరిషత్‌కు చెందిన మావోయిస్టులు గత రాత్రి ఈ పనికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. తొలుత తోరి రైల్వే సైడింగ్‌పై దాడి చేసిన మావోయిస్టులు, అక్కడ నిద్రలో ఉన్న కార్మికులపై విరుచుకుపడ్డారని, వారి మొబైల్స్ ఎత్తుకెళ్లడంతో పాటు సైడింగ్ వద్ద నిలిపి ఉంచిన 16 వాహనాలకు నిప్పుపెట్టి పరారైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. సుమారు 15 మంది జేజేఎంపీ మనుషులు ఈ దాడిలో పాల్గొన్నారని, విచక్షణారహితంగా కాల్పులు జరిపారని చెప్పారు. అయితే, ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదన్నారు. టోరి సైడింగ్ నుంచి జరుగుతున్నబొగ్గు రవాణాకు లెవీ ఇవ్వకపోవడమే మావోయిస్టుల దాడికి కారణంగా చెబుతున్నారు. కాగా, దాడి నేపథ్యంలో బొగ్గు రవాణాను నిలిపివేసి, అదనపు బలగాలను అక్కడికి తరలించారు.