Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

బ్రేకింగ్‌.. నక్సలైట్లకు భారీ షాక్.. ఆ కీలక నేత హతం..!

Naxal with Rs Eight lakh bounty on his head killed in encounter with police in Chhattisgarh, బ్రేకింగ్‌.. నక్సలైట్లకు భారీ షాక్.. ఆ కీలక నేత హతం..!

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెసలిందే. అయినప్పటికీ దండకారణ్యంలో నిత్యం తుపాకుల మోత మోగుతోంది. తాజాగా మంగళవారం కూడా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌ ఒకరు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్‌ జిల్లాలోని హర్రెపల్‌ అండ్ బీచ్‌పల్‌ అటవీ ప్రాంతంలో ఈ ఉదయం ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. దంతెవాడ, బీజాపూర్‌కు చెందిన డీఆర్‌ఈ, స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ సిబ్బంది కూంబింగ్ చేపడుతున్నారు. ఈ క్రమంలో వీరిని గమినించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఓ మోస్ట్ వాంటెడ్‌ నక్సలైట్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో చనిపోయిన నక్సలైట్‌ను దర్సు పూనెంగా గుర్తించారు. ఇతనిపై ఎనిమిది లక్షల రివార్డు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

Related Tags