50 మంది గర్భిణులు.. ఒకేచోట చేరి.. అదరగొట్టేశారు

మనదేశంలో నిండు గర్భిణులను కాలు కదపనివ్వకుండా.. ఎలాంటి పనులు చేయనివ్వకుండా చూసుకుంటుంటారు కుటుంబసభ్యులు. అయితే తాజాగా గుజరాత్‌లోని సూరత్‌లో నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు కొందరు నిర్వాహకులు. ఇక ఇందులో పాల్గొన్న 50మంది గర్భిణులు గర్బా పాటలకు ఉత్సాహంగా డ్యాన్సులు వేశారు. ఈ సందర్భంగా ఓ గర్భిణి మాట్లాడుతూ.. తాను గత పదేళ్లుగా గర్బా నృత్యంచేస్తూ వస్తున్నానని, అయితే ప్రెగ్నెన్సీ కారణంగా ఈసారి గర్బాలో పాల్గొనలేనేమోనని అనుకున్నానని.. కానీ ఇలా ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం […]

50 మంది గర్భిణులు.. ఒకేచోట చేరి.. అదరగొట్టేశారు
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 07, 2019 | 4:20 PM

మనదేశంలో నిండు గర్భిణులను కాలు కదపనివ్వకుండా.. ఎలాంటి పనులు చేయనివ్వకుండా చూసుకుంటుంటారు కుటుంబసభ్యులు. అయితే తాజాగా గుజరాత్‌లోని సూరత్‌లో నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు కొందరు నిర్వాహకులు. ఇక ఇందులో పాల్గొన్న 50మంది గర్భిణులు గర్బా పాటలకు ఉత్సాహంగా డ్యాన్సులు వేశారు.

ఈ సందర్భంగా ఓ గర్భిణి మాట్లాడుతూ.. తాను గత పదేళ్లుగా గర్బా నృత్యంచేస్తూ వస్తున్నానని, అయితే ప్రెగ్నెన్సీ కారణంగా ఈసారి గర్బాలో పాల్గొనలేనేమోనని అనుకున్నానని.. కానీ ఇలా ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. ఈ నృత్యం కారణంగా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా ఆనందిస్తాడని ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ.. గర్భ ఆడే మహిళల్లో ఎండార్ఫిన్ హార్మోన్ వృద్ధి చెందుతుందన్నారు. ఇది శరీరానికి ఎంతో ప్రయోజనకారి అని, డెలివరీ సమయంలో పెయిన్ తగ్గేందుకు అవకాశముంటుందని వారు తెలిపారు.