Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

ఢిల్లీ ఎన్నికలు: కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ల జాబితా విడుదల!

Delhi election: Navjot Singh Sidhu, Shatrughan Sinha feature with Gandhis in Congress star campaigners' list, ఢిల్లీ ఎన్నికలు: కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ల జాబితా విడుదల!

70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపైనర్ల జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. కాగా గతేడాది జూలైలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన మంత్రి పదవికి సిద్దూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బహిరంగ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించని సిద్ధూను కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ తెరమీదికి తీసుకురావడం గమనార్హం. ఇక గతేడాది బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా కూడా కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్‌గా వ్యవహరించనున్నారు.

ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నామినేషన్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ల జాబితా విడుదల చేయడం గమనార్హం. స్టార్ క్యాంపైనర్ల జాబితాలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెప్టెన్ అమరీందర్ సింగ్ (పంజాబ్), అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), కమల్‌నాథ్ (మధ్య ప్రదేశ్), భూపేశ్ బాఘెల్ (చత్తీస్‌గఢ్), వి. నారాయణ స్వామి (పుదుచ్చేరి) కూడా ఉన్నారు. రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

 

Delhi election: Navjot Singh Sidhu, Shatrughan Sinha feature with Gandhis in Congress star campaigners' list, ఢిల్లీ ఎన్నికలు: కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ల జాబితా విడుదల!

22/01/2020,5:02PM

Related Tags