పాకిస్థాన్ మొత్తాన్ని నిందించడం సరికాదట

సిద్ధూ సంచలన వ్యాఖ్యలు పాకిస్థాన్‌ మొత్తాన్ని నిందించడం సరికాదు గతంలో పాక్ ప్రధాని ప్రమాణ స్వీకారానికి హాజరైన సిద్ధూ న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి ఘటనపై పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం దాడి ఘటనను ముక్తకంఠంతో ఖండిస్తుంటే సిద్ధూ మాత్రం పాక్ పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. కొంతమంది చేసిన తప్పకు దేశం మొత్తాన్ని నిందించడం సరికాదని అన్నారు. అయితే ఉగ్రదాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇదొక పిరికిపంద […]

పాకిస్థాన్ మొత్తాన్ని నిందించడం సరికాదట
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 8:13 PM

  • సిద్ధూ సంచలన వ్యాఖ్యలు
  • పాకిస్థాన్‌ మొత్తాన్ని నిందించడం సరికాదు
  • గతంలో పాక్ ప్రధాని ప్రమాణ స్వీకారానికి హాజరైన సిద్ధూ

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి ఘటనపై పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం దాడి ఘటనను ముక్తకంఠంతో ఖండిస్తుంటే సిద్ధూ మాత్రం పాక్ పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. కొంతమంది చేసిన తప్పకు దేశం మొత్తాన్ని నిందించడం సరికాదని అన్నారు. అయితే ఉగ్రదాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇదొక పిరికిపంద చర్య అని అన్నారు.

గతంలో కూడా సిద్ధూ పాక్ ప్రధాని తన సమకాలీన క్రికెట్ అయిన ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లి వచ్చారు. ఆ సమయంలో పాక్ ఆర్మీ ఛీఫ్‌ను ఆలింగనం చేసుకుని తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రదాడిని ఖండిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ పాక్‌ను దుయ్యబట్టారు. ఆ దేశానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని అన్నారు. భారత ప్రభుత్వం ఇకనైనా ముందడుగు వేసి దీటుగా బదులివ్వాలని కోరారు.