Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 46 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 246628 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 120406 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 119293 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6929 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • తిరుపతి: రేపటి నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభం. ఎనభై రోజుల తరవాత ప్రారంభమవుతున్న దర్శనాలు. రేపు ఎల్లుండి ఉద్యోగులతో ట్రయల్ రన్ ద్వారా దర్శనాలు. పదో తేదీ తిరుమల పై ఉన్న స్థానికులకు దర్శనాలు. 11వతీదీ నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభం. జూన్ నెలకు ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలు రేపటి నుంచి టిటిడి వెబ్ సైట్ లో లభ్యం. ఆఫ్ లైన్లో తిరుపతిలోని కౌంటర్లలో టికెట్లు లభ్యం. అలిపిరి నడక మార్గం నుంచి భక్తులు వెళ్లేందుకు అనుమతి. కాణిపాకం దేవాలయంలో రేపటి నుంచి ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్. పదో తేదీ నుంచి గంటకు మూడువందలమంది వరకూ భక్తులకు దర్శనాలు. శ్రీకాళహస్తిలో దేవాలయం రెడ్ జోన్ లో ఉండటం వల్ల ప్రస్తుతానికి దర్శనాలు ప్రారంభించడం లేదని ప్రకటించిన అధికారులు.
  • నిమ్స్ లోని 5 విభాగాలు 7 నుండి9 వ తేదీ వరకు ముత పడనున్నాయ్. పాజిటివ్ వచ్చిన వారూ పనిచేసిన విభాగాలను శానిటేషన్ చేయనున్న హాస్పిటల్ సిబ్బంది ghmc. ముత పడనున్న 5 విభాగాలు: మెడ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ & సర్జికల్ ఆంకాలజీ.
  • గ్రేటర్ మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడం గందరగోళంగా మారుతుందని భావించిన ప్రభుత్వం... గ్రేటర్ లోనే సగంమంది 10th విద్యార్థులు. సప్లమెంటరీ రాసిన విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్లు దొరకడం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన సర్కార్ . అందరికి ఒకేసారి పరీక్షలు నిర్వహించాలనే యోచలనలో ప్రభుత్వం.
  • విజయవాడ: గ్యాంగ్ వార్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. డీసీపీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో విచారణ.. సందీప్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. 13 మంది నిందితులను విచారిస్తున్న పోలీసులు.. ల్యాండ్ సెటిల్మెంట్ వివాదమే కారణమని గుర్తింపు.. ధనేకుల శ్రీధర్, ప్రతాప్ రెడ్డి డి నాగబాబులను విచారిస్తున్న పోలీసులు.. మంగళగిరి కి చెందిన ఇద్దరు రౌడిసీటర్ల ఉన్నట్టు గుర్తింపు.. టెక్నాలజీ సహాయంతో కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుల పండు తల్లిని పాత్రపై విచారిస్తున్న పోలీసులు..
  • అమరావతి: ఈనెల 16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం. 18న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్. కోవిడ్ నేపథ్యంలో 14 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు కుదించే అవకాశం. ఈనెల 31తో ముగియనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.

నవదీప్‌కు బంపరాఫర్.. సన్నీ పక్కన ఛాన్స్

Navdeep to romance Sunny Leone, నవదీప్‌కు బంపరాఫర్.. సన్నీ పక్కన ఛాన్స్

ఒకప్పుడు హీరోగా మంచి హిట్లను కొట్టి.. ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలు చేస్తున్న నవదీప్‌కు ఇప్పుడు బంపరాఫర్ వచ్చేసింది. బాలీవుడ్ ఎంట్రీతో పాటు హాట్ బ్యూటీ సన్నీ లియోన్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు ఈ హీరో. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏఎల్‌టీ బాలాజీ హిందీలో తెరకెక్కిస్తోన్న రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్ అనే వెబ్ సిరీస్‌లో ఈ ఇద్దరు కలిసి నటించనున్నారు. ఈ సందర్భంగా నవదీప్‌తో సెల్ఫీని తీసుకున్న సన్నీ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నవదీప్‌తో కలిసి పనిచేయబోతున్నా. ఇలాంటి మంచి వ్యక్తితో కలిసి పనిచేయబోతున్నందుకు సంతోషంగా ఉంది ట్వీట్ చేసింది. దీనికి నవదీప్ రిప్లై ఇస్తూ.. మై ప్లజర్ సన్నీ.. యు ఆర్ సో ఫన్నీ అన్ని కామెంట్ పెట్టాడు. కాగా హారర్ కథాంశంతో రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్ తెరకెక్కనుంది.

అయితే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న అల వైకుంఠపురంలో చిత్రంలో నవదీప్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌లో నవదీప్‌, సన్నీ కలిసి నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇందుకోసం వీరిద్దరు కలిసి పనిచేయలేదని.. రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్‌లో ఈ ఇద్దరు నటించనున్నారని స్పష్టత వచ్చేసింది.

Related Tags