ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఓ ఉగ్రవాదట..! ఆధారాలు కూడా ఉన్నాయంటున్న కేంద్రమంత్రి..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్. కేజ్రీవాల్ ఓ ఉగ్రవాదంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆయన ఓ టెర్రరిస్ట్ అని నిరూపించేందుకు ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. తాను ఉగ్రవాదినా.. అంటూ కేజ్రీవాల్ అమాయకుడిలా ఢిల్లీ ప్రజలను అడుగుతున్నారన్నారు. దానికి సమాధానం ఆయన ఉగ్రవాదేనని జవదేకర్ అన్నారు. గతంలో తాను అరాచకవాదినని అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా చెప్పకున్నారని మంత్రి పేర్కొన్నారు. అరాచకవాదికి ఉగ్రవాదికి తేడా ఏం ఉండదన్నారు. కేంద్రమంత్రి కేజ్రీవాల్‌పై చేసిన […]

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఓ ఉగ్రవాదట..! ఆధారాలు కూడా ఉన్నాయంటున్న కేంద్రమంత్రి..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్. కేజ్రీవాల్ ఓ ఉగ్రవాదంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆయన ఓ టెర్రరిస్ట్ అని నిరూపించేందుకు ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. తాను ఉగ్రవాదినా.. అంటూ కేజ్రీవాల్ అమాయకుడిలా ఢిల్లీ ప్రజలను అడుగుతున్నారన్నారు. దానికి సమాధానం ఆయన ఉగ్రవాదేనని జవదేకర్ అన్నారు. గతంలో తాను అరాచకవాదినని అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా చెప్పకున్నారని మంత్రి పేర్కొన్నారు. అరాచకవాదికి ఉగ్రవాదికి తేడా ఏం ఉండదన్నారు. కేంద్రమంత్రి కేజ్రీవాల్‌పై చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యలపై ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సీఎంపై ఇలాంటి భాష ప్రయోగించడంపై కేంద్రమంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఎలక్షన్ కమిషన్‌ను కోరారు.

అటు బీజేపీపై కూడా నిప్పులు చెరిగారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉగ్రవాది అయితే ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయ్యాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. దేశరాజధానిలో ఎలక్షన్ కమిషన్ ఉన్న దగ్గరే కేంద్రమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఇక మరో బీజేపీ నేత కపిల్ మిశ్రా కూడా ఆప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆప్‌ తన పార్టీని.. ముస్లిం లీగ్‌ అని మార్చుకుంటే మంచిదంటూ హితవు పలికారు.

Published On - 4:30 am, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu