నన్ను జైలుకు పంపినా భయపడను: కేంద్రంపై దీదీ ఫైర్

ప్రస్తుతం దేశం అధ్యక్ష పాలన దిశగా అడుగులు వేస్తోందన్నారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేయడానికి కూడా వెనకాడటం లేదన్నారు. కశ్మీర్‌లోని వాస్తవ పరిస్థితి గురించి మాట్లాడే వారిని కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని, అసమ్మతి తెలిపే గొంతులను అణచివేస్తోందని మమతా మండిపడ్డారు. దేశం అధ్యక్ష తరహా పాలన కోసం పయనిస్తున్నట్టుగా ఉందని, ఒకవేళ అదే గనుక జరిగితే ఇక ప్రజాస్వామ్యానికి చోటు ఉండదన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తనను అరెస్ట్ చేసి […]

నన్ను జైలుకు పంపినా భయపడను:  కేంద్రంపై  దీదీ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 28, 2019 | 6:43 PM

ప్రస్తుతం దేశం అధ్యక్ష పాలన దిశగా అడుగులు వేస్తోందన్నారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేయడానికి కూడా వెనకాడటం లేదన్నారు. కశ్మీర్‌లోని వాస్తవ పరిస్థితి గురించి మాట్లాడే వారిని కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని, అసమ్మతి తెలిపే గొంతులను అణచివేస్తోందని మమతా మండిపడ్డారు. దేశం అధ్యక్ష తరహా పాలన కోసం పయనిస్తున్నట్టుగా ఉందని, ఒకవేళ అదే గనుక జరిగితే ఇక ప్రజాస్వామ్యానికి చోటు ఉండదన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తనను అరెస్ట్ చేసి జైలుకు పంపినా భయపడేది లేదన్నారు బెంగాల్ దీదీ.