అయోధ్యకు వెళ్తా, కానీ ప్రధాని మోదీ గురించే ఆందోళన, ఉమాభారతి

అయోధ్యలో ఈ నెల 5 న జరిగే భూమిపూజ కార్యక్రమానికి తాను వెళ్తానని, కానీ ఆ సమయానికి అక్కడ ఉండనని బీజేపీ నాయకురాలు ఉమాభారతి తెలిపారు.

అయోధ్యకు వెళ్తా, కానీ ప్రధాని మోదీ గురించే ఆందోళన, ఉమాభారతి

అయోధ్యలో ఈ నెల 5 న జరిగే భూమిపూజ కార్యక్రమానికి తాను వెళ్తానని, కానీ ఆ సమయానికి అక్కడ ఉండనని బీజేపీ నాయకురాలు ఉమాభారతి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆమె ట్వీట్ చేశారు. శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన అనంతరం తను ఆ ప్రదేశాన్ని సందర్శిస్తానన్నారు. హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు కోవిడ్-19 బారిన పడడం తనకు ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్న ఆమె.. అయోధ్యలో జరిగే ఈవెంట్ కి వేలాది మంది హాజరవుతున్న దృష్ట్యా.. ప్రధాని మోదీ గురించిన చింత తనకు ఉందన్నారు. ఆ సమయానికి నేను సరయు నదీ తీరాన ఉంటానని ఉమాభారతి తెలిపారు.

భూమి పూజకు  నేను అటెండ్ కావడంలేదు గనుక గెస్ట్ లిస్ట్ నుంచి నాపేరు తొలగించండి అని ఉమాభారతి… అయోధ్య ట్రస్ట్ నిర్వాహకులను కోరారు.

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu