కరోనా కట్టడిలో వైద్య నిపుణుల కృషి ప్రశంసనీయం.. త్వరలోనే ప్రపంచానికి మహమ్మారి నుంచి విముక్తిః మంత్రి హర్షవర్ధన్

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. కరోనా పై పోరులో లక్షలాది మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే, కరోనా యుద్దంలో విజయం వెళ్తున్నామని...

  • Balaraju Goud
  • Publish Date - 2:11 pm, Wed, 27 January 21
కరోనా కట్టడిలో వైద్య నిపుణుల కృషి ప్రశంసనీయం.. త్వరలోనే ప్రపంచానికి మహమ్మారి నుంచి విముక్తిః మంత్రి హర్షవర్ధన్

World on verge : కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. కరోనా పై పోరులో లక్షలాది మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే, కరోనా యుద్దంలో విజయం వెళ్తున్నామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. వర్చువల్ గా జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశం లో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పాల్గొన్నారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి ను ఓడించేందుకు యావత్ ప్రపంచం చేస్తున్న పోరు తుది దశకు చేరుకుందన్నారు. త్వరలోనే ప్రపంచం మొత్తం విముక్తి కలుగుతుందన్నారు. ఈ మహమ్మారి ను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు చూపిన చొరవ, ముందస్తు వ్యూహాలు, పరస్పర సహకారం వలనే సాధ్యం అయింది అని చెప్పుకొచ్చారు.


కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు ఏకతాటి పైకి వచ్చే అవకాశం కలిగిందన్న ఆయన.. మహమ్మారిని తరిమికొట్టేందుకు విశ్వప్రయత్నం చేశారన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కరోనా తొలగిపోలేదన్న మంత్రి.. ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. యావత్ ప్రపంచం సురక్షితంగా ఉంటేనే మనం భద్రం గా ఉంటామని, లేదంటే ముప్పు తప్పదు అని హెచ్చరించారు. వీటి పరిష్కారం కోసం ప్రపంచం ఆరోగ్య సంస్థ సమర్థమైన వ్యూహాలతో మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అన్నారు.