సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు

సరిహద్దు రక్షణలో పురుషులతో పాటు.. మహిళలు కూడా రంగంలోకి దిగారు. అది కూడా జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల్లో. గతంలో ఇతర దేశాల సరిహద్దుల వద్ద మహిళా జవాన్లు రక్షణ విధుల్లో ఉన్న సంగతి..

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు

సరిహద్దు రక్షణలో పురుషులతో పాటు.. మహిళలు కూడా రంగంలోకి దిగారు. అది కూడా జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల్లో. గతంలో ఇతర దేశాల సరిహద్దుల వద్ద మహిళా జవాన్లు రక్షణ విధుల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో తొలిసారి ఆయుధాలతో మహిళా సైనికులను కూడా మోహరించారు అధికారులు. అసోం రైఫిల్స్‌కు చెందిన మహిళా జవాన్ల టీంతో ఈ ప్రక్రియ తొలిసారి ప్రారంభించారు. పారామిలటరీ విభాగంలో ఇలా మహిళలను నియమించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఇక సరిహద్దు గ్రామాల్లో సాయుధులుగా ఉన్న మహిళా జవాన్లను చూసి సంబరపడిపోతున్నారు. వారితో ఆప్యాయంగా పలకరిస్తూ ముచ్చటిస్తున్నారు. కాగా, జమ్ముకశ్మీర్‌ సరిహద్దు ప్రాంతంలో చలి విపరీతంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ చలిని తట్టుకుంటూ.. విధులను నిర్వర్తిస్తున్నారు.

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

Click on your DTH Provider to Add TV9 Telugu