Crime: యూపీలో దారుణం.. జాబ్ అప్లై చేసేందుకు వెళ్లిన మహిళపై గ్యాంగ్‌ రేప్‌.. వీడియో రికార్డు చేసి..

బాధితురాలు మే 28న అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టు కోసం ఫారం నింపేందుకు ప్రజాసేవ కేంద్రానికి వెళ్లింది. ఒంటరిగా ఉండటంతో ఆమెపై నిర్వాహకులు కన్నేశారు.

Crime: యూపీలో దారుణం.. జాబ్ అప్లై చేసేందుకు వెళ్లిన మహిళపై గ్యాంగ్‌ రేప్‌.. వీడియో రికార్డు చేసి..
Rape Case
Follow us

|

Updated on: Aug 07, 2022 | 11:34 AM

Woman Gang-Raped In Mathura: ఓ మహిళ ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు ప్రజాసేవ కేంద్రానికి వెళ్లింది.. ఒంటరిగా వచ్చిన ఆ మహిళపై అక్కడున్న సిబ్బంది కన్నేశారు. అనంతరం.. నలుగురు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి సంబంధించిన దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేశారు. అనంతరం ఆ వీడియోను ఆమె అత్తామామలకు పంపించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.

మధుర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు మే 28న అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టు కోసం ఫారం నింపేందుకు ప్రజాసేవ కేంద్రానికి వెళ్లింది. మహిళ ఒంటరిగా ఉండటంతో ఆమెపై నిర్వాహకులు కన్నేశారు. సెంటర్‌ ఆపరేటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, షాపు యజమాని, మరో వ్యక్తి కలిసి ఆమెపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు అభ్యంతరకర వీడియో చిత్రీకరించి.. మహిళ అత్తమామలకు పంపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని రూరల్ ఎస్పీ శ్రీష్ చంద్ర తెలిపారు.

ప్రధాన నిందితుడు మహిళ తల్లిదండ్రులు నివసించే అలీగఢ్ జిల్లాలోని అదే గ్రామానికి చెందినవాడని తెలిపారు. మహిళ, నిందితులు కూడా కలిసి చదువుకున్నారని అధికారి తెలిపారు. ఈ కేసులో నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కాగా.. ఈ సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి..
భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి..
కావ్యా పాపతో ఉన్న ఈ క్యూటీ ఆ స్టార్ క్రికెటర్ చెల్లినా?
కావ్యా పాపతో ఉన్న ఈ క్యూటీ ఆ స్టార్ క్రికెటర్ చెల్లినా?
లోక్‌సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి ఆరుగురు మహిళలు
లోక్‌సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి ఆరుగురు మహిళలు
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా