బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడు.. పోలీసులకు భార్య ఫిర్యాదు

బట్టతల దాచి పెట్టి తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ ఓ భార్య పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది.

  • Tv9 Telugu
  • Publish Date - 12:57 pm, Sun, 1 November 20
బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడు.. పోలీసులకు భార్య ఫిర్యాదు

Woman complaint Husband: బట్టతల దాచి పెట్టి తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ ఓ భార్య పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మీరా రోడ్‌కి చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్‌కి గత నెలలో పెళ్లైంది. పైళ్లైన తరువాత అతడికి బట్టతల ఉందని ఆమె గుర్తించింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటూ భర్తపై, అతడి కుటుంబసభ్యులపై ఆమె ఫిర్యాదు చేసింది. (‘మహా సముద్రం’ కోసం గోవా వెళ్లనున్న టీమ్‌..!)

పెళ్లికి ముందు విగ్గు పెట్టుకొని మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు తనను వేధిస్తున్నారని తెలిపింది. భర్త లేనిపోని అనుమానాలతో తన ఫోన్‌ను హ్యాక్‌ చేసి కాల్‌ రికార్డులు, చాటింగ్‌ విషయాలు చెక్‌ చేస్తున్నాడని వివరించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. (RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అడుగుపెట్టనున్న లేడీ స్కాట్‌)