ముంబై హైకోర్టు సంచలన తీర్పు… భార్య కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితం కాదంటూ..!

Bombay High Court: ముంబై హైకోర్టు మరో సంచలన తీర్పును వెలువరించింది. టీ చేయడానికి నిరాకరించిందని భార్యను సుత్తితో కొట్టిన చంపిన కేసులో..

ముంబై హైకోర్టు సంచలన తీర్పు... భార్య కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితం కాదంటూ..!
Ravi Kiran

|

Feb 25, 2021 | 12:32 PM

Bombay High Court: ముంబై హైకోర్టు మరో సంచలన తీర్పును వెలువరించింది. టీ చేయడానికి నిరాకరించిందని భార్యను సుత్తితో కొట్టిన చంపిన కేసులో భర్తకు శిక్ష పడేలా కీలక జడ్జిమెంట్‌ను ప్రకటించింది. భార్య అనేది కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితం కాదని.. భర్తకు ఉండే అన్ని సమాన హక్కులు ఆమెకు కూడా ఉంటాయని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి రేవతి మొహితే దేరే మాట్లాడుతూ.. ” భార్య అనేది సాధనం లేదా వస్తువు కాదు. వివాహం అనేది సమానత్వంపై ఆధారపడిన ఓ బంధం. ఇరువురికీ సమాన హక్కులు ఉంటాయి. అయితే సమాజంలో ఉండే లింగభేదాల హెచ్చుతగ్గులు కొన్నిసార్లు వైవాహిక జీవితంలో కూడా ఎదురవుతాయి. అంతమాత్రానా స్త్రీ పురుషుడి కంటే తక్కువ అని అర్ధం కాదు. భార్య అనేది కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితం కాకూడదు” అని పేర్కొన్నారు.

”ఇలాంటి అసమతుల్యతలతో వైవాహిక జీవితాన్ని సాగిస్తున్న భార్యాభర్తలు ఎప్పటికీ అణచివేత, అసమతుల్యత మధ్య నలిగిపోతుంటారు. అప్పుడప్పుడూ సమాజంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా మహిళలు తమకు తాముగా భర్తల చెప్పుచేతల్లో నడుస్తుంటారు. అలాంటి సందర్భాల్లో మగవారు ఆధిపత్యం చెలాయించడమే కాకుండా భార్యలను ఓ సాధనంగా లేదా వస్తువుగా భావిస్తారు” అని న్యాయమూర్తి తెలిపింది.

తన కోసం ఉదయాన్నే టీ సిద్దం చేయని భార్యను సుత్తితో చంపిన భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా బెంచ్ విచారణ చేపట్టింది. భార్యను చంపిన అనంతరం ఆ భర్త సుత్తికి అంటిన రక్తాన్ని తుడిచేయడమే కాకుండా సాక్ష్యాలు అనేవి దొరకకుండా ఆ ప్రదేశాన్ని మొత్తం శుభ్రపరిచాడు. అయితే జరిగిన సంఘటన మొత్తాన్ని ఆ దంపతుల ఆరేళ్ల కూతురు చూడటంతో.. ఆ చిన్నారి తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చింది. అయితే నిందితుడు తనను తాను రక్షించుకునేందుకు.. తన టీ సిద్దం చేయలేదని.. అంతేకాకుండా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిందని అందువల్ల కోపంతో చంపెసినట్లు పేర్కొన్నాడు. ఆ వ్యాఖ్యలన్నీ కూడా జస్టిస్ మొహితే డేరే కొట్టిపారేస్తూ.. ఈ సమాజంలో భార్య అనేది ఓ వస్తువుగా భావించే స్వభావం కలిగిన మనుషులు ఎక్కువైపోయారు. ఇది ఆమోదించలేమని పేర్కొంటూ నిందితుడు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి:

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!

Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్‌ చేసిన రియల్‌ హీరో.. చివరికి ఏమైందంటే.!

ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu