‘ రామా ! అయోధ్యలో నీ ఆలయ నిర్మాణం ఎప్పుడు ‘ ?

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముహూర్తం ఎప్పుడు ? వచ్ఛే ఏడాది ఏప్రిల్ 2 న శ్రీరామనవమి సందర్భంగా ఆలయ నిర్మాణం ప్రారంభం కావచ్చునని అంటున్నారు. గుడి నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఏప్రిల్ 2 న శిలాన్యాస్ జరుగుతుందా లేక శంకు స్థాపన చేస్తారా అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. అక్కడ 1989 లో శిలాన్యాస్ జరిగింది. ఆలయ నిర్మాణం రెండు లేదా మూడేళ్ళలో పూర్తి […]

' రామా ! అయోధ్యలో నీ ఆలయ నిర్మాణం ఎప్పుడు ' ?
Pardhasaradhi Peri

|

Nov 11, 2019 | 5:00 PM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముహూర్తం ఎప్పుడు ? వచ్ఛే ఏడాది ఏప్రిల్ 2 న శ్రీరామనవమి సందర్భంగా ఆలయ నిర్మాణం ప్రారంభం కావచ్చునని అంటున్నారు. గుడి నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఏప్రిల్ 2 న శిలాన్యాస్ జరుగుతుందా లేక శంకు స్థాపన చేస్తారా అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. అక్కడ 1989 లో శిలాన్యాస్ జరిగింది. ఆలయ నిర్మాణం రెండు లేదా మూడేళ్ళలో పూర్తి కావచ్ఛునని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. వివాదాస్పదమైన 2.77 ఎకరాల స్థలాన్ని ట్రస్టుకు, 5 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఒకే సమయంలో కేటాయించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అయితే ఈ ఆఫర్ ను అంగీకరించాలా లేక తోసిపుచ్చాలా అన్న అంశంపై బోర్డు మరో 15 రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. మసీదు నిర్మాణానికి గాను ఈ బోర్డుకు మూడు, నాలుగు స్థలాలను చూపాలని యూపీ సీఎం కార్యాలయం అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ ను కోరింది. అటు-ఆలయ నిర్మాణం సోమనాథ ఆలయం లేదా అమరనాథ ఆలయం.. లేక మాతా వైష్ణోదేవి ఆలయ డిజైన్లను పోలి ఉండవచ్ఛునని అంటున్నారు. వివాదాస్పద స్థలం చుట్టూ తాము స్వాధీనం చేసుకున్న 62.23 ఎకరాల స్థలాన్ని కూడా కేంద్రం ట్రస్టుకు అప్పగించవచ్చునని తెలుస్తోంది. రాముని గుడి నిర్మాణానికి అవసరమైన లక్షా 80 వేల శిలా ఫలకాలు తదితరాలను రామజన్మ భూమి న్యాస్ ఇదివరకే సేకరించింది. న్యాస్ సభ్యులు త్వరలో సమావేశమై ఆలయ నిర్మాణం ఎప్పటినుంచి ప్రారంభించాలన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu