Covid-19 Vaccination: ఎయిమ్స్‌లో న్యూ సీన్! ప్రధాని మోదీకి వ్యాక్సిన్ ఎవరిచ్చారు? అనంతరం ఆయన ఏమన్నారు?

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఎయిమ్స్ లో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇద్దరు నర్సులు ఆయనకు కరోనా వైరస్ టీకామందు ఇచ్చారు. 60 ఏళ్ళ వారికి.., 

Covid-19 Vaccination: ఎయిమ్స్‌లో న్యూ సీన్! ప్రధాని మోదీకి వ్యాక్సిన్ ఎవరిచ్చారు? అనంతరం ఆయన ఏమన్నారు?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 01, 2021 | 11:03 AM

Covid-19 Vaccination: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఎయిమ్స్ లో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇద్దరు నర్సులు ఆయనకు కరోనా వైరస్ టీకామందు ఇచ్చారు. 60 ఏళ్ళ వారికి,  వివిధ వ్యాధులతో సతమతమవుతున్న 45 ఏళ్ళు, ఆ పైబడినవారికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం మోదీ..ఎయిమ్స్ లో నా తొలి కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నానని, కోవిడ్ పై పోరులో గ్లోబల్ ఫైట్ ని బలోపేతం చేయడంలోను,  మరింత ముందుకు తీసుకువెళ్లడంలోను  మన డాక్టర్లు, శాస్త్రజ్ఞులు ఇంత త్వరగా కృషి చేయడం ముదావహమని పేర్కొన్నారు. ఇది చాలా సంతోషకరమన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి  అర్హత గల… తగిన వయస్సువారంతా దీన్ని తీసుకోవాలని కోరుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. అందరం కలిసి ‘కోవిడ్-19 ఫ్రీగా ‘ ఇండియాను మారుద్దాం అని ఆయన అన్నారు. ఇదొక మహత్తర కార్యక్రమం అని అభివర్ణించారు.

కాగా కేరళ, పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన రోసమ్మ అనిల్, పి.నివేద అనే నర్సులు మోదీకి వ్యాక్సిన్ ఇచ్చారు. టీకామందు తీసుకున్న అనంతరం ఆయన..’వ్యాక్సిన్ ఇచ్ఛేశారా ? కనీసం నేను ఫీల్ కూడా కాలేదు’ అని ఆయన తనతో అన్నారని పి.నివేద తెలిపింది. ఈమె మూడేళ్ళుగా ఎయిమ్స్ లో నర్సుగా పని చేస్తోంది. వ్యాక్సిన్ తీసుకోవడానికి మోదీ వస్తున్నారని తనకు ఈ ఉదయమే తెలిసిందని ఆమె చెప్పింది. తనను ఈ సెంటర్ లో పోస్ట్ చేశారని, ప్రధానిని ఈ సందర్భంగా కలుసుకోవడం తనకు గొప్పగా ఉందని నివేద పేర్కొంది. ఇలా ఉండగా భారత్ బయో టెక్ వారి కోవాగ్జిన్ వ్యాక్సిన్ ని మోదీ తీసుకున్నారు. ట్రయల్ దశల్లో ఉండగానే ఈ వ్యాక్సిన్ వివాదాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మూడో దశ ట్రయల్ ఇంకా ప్రారంభం కాకముందే ఈ టీకామందు అత్యవసర వినియోగానికి ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు శశిథరూర్ తదితరులు నాడు ప్రశ్నించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది.  పైగా ప్రజలకు సలహా ఇచ్ఛేముందు ప్రధాని, ఇతర బీజేపీ నేతలు మొదట వ్యాక్సిన్ తీసుకోవాలని కూడా పలువురు విపక్ష నేతలు డిమాండ్ చేశారు. మొత్తానికి మోదీ వ్యాక్సిన్ తీసుకుని ఈ వివాదానికి స్వస్తి పలికారు.

అటు-మీరెక్కడి నుంచి వచ్చారని మోదీ ప్రశ్నించారని రోసమ్మ అనిల్ తెలిపింది. ఈ దేశ ప్రధానికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం తమకు లభించిందని ఆమె హర్షం వ్యక్తం చేసింది.

మరిన్ని చదవండి ఇక్కడ :

మొదటి సారి కోవిద్ వాక్సిన్ తీసుకున్న ప్రధాని మోదీ..నేటి నుండి రెండవ దశ వ్యాక్సినేషన్ డ్రైవ్:PM Modi Takes Covid Vaccine Photos.

షాక్ మీద షాక్ లు ఇస్తున్న పెట్రోల్ , డీజిల్ ధరలు..గుడ్ న్యూస్ చెప్పిన జొమాటో సంస్థ : Good News For Zomato Delivery Boys.

PM Modi takes Covid-19 Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ టీకాను తీసుకున్న ప్రధాని మోదీ