బాలీవుడ్ దిగ్గజాలతో మీటింగ్.. మోదీజీ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

బాలీవుడ్ దిగ్గజాలతో మీటింగ్.. మోదీజీ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

‘నా దారి రహదారి.. డోంట్ కమ్ ఇన్ మై వే’ అనే రజనీకాంత్ డైలాగు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సరిగ్గా సూట్ అవుతుంది. ఎప్పుడు ఎవరిని సీన్‌లోకి తీసుకురావాలో.. సమయానికి తగ్గట్టు వ్యహారచనలు చేయడంలో మోదీని మించినోడు ఉండరనే చెప్పాలి. ఇప్పటివరకు దేశం కోసం ప్రధానులు వ్యవహరించని తీరులో పక్కా ప్రణాళికలతో ముందుకు దూసుకుపోతున్నారు. దేశ ప్రజలకు ఏదైనా సందేశం బోధించాలంటే.. అది ఒక్క సినిమా సెలబ్రిటీల వల్లే సాధ్యపడుతుంది. ఈ విషయం అందరికి […]

Ravi Kiran

|

Oct 20, 2019 | 12:41 PM

‘నా దారి రహదారి.. డోంట్ కమ్ ఇన్ మై వే’ అనే రజనీకాంత్ డైలాగు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సరిగ్గా సూట్ అవుతుంది. ఎప్పుడు ఎవరిని సీన్‌లోకి తీసుకురావాలో.. సమయానికి తగ్గట్టు వ్యహారచనలు చేయడంలో మోదీని మించినోడు ఉండరనే చెప్పాలి. ఇప్పటివరకు దేశం కోసం ప్రధానులు వ్యవహరించని తీరులో పక్కా ప్రణాళికలతో ముందుకు దూసుకుపోతున్నారు.

దేశ ప్రజలకు ఏదైనా సందేశం బోధించాలంటే.. అది ఒక్క సినిమా సెలబ్రిటీల వల్లే సాధ్యపడుతుంది. ఈ విషయం అందరికి తెలుసు. ఇంకేముంది మోదీ.. బాలీవుడ్ దిగ్గజాలందరిని విందుకు పిలిచి.. గాంధీతత్త్వం గురించి కొన్ని నీతి బోధనలు చేసి.. ఆయన ఆశయాల్ని, మార్గాన్ని దేశ ప్రజలకు చెప్పండంటూ విన్నవించుకున్నారు.

ప్రధాని మోదీ నుంచి పిలుపు.. పైగా గాంధీ ఆశయాలు.. బాలీవుడ్ ప్రముఖులకు ఇంకేం కావాలి. మోదీ ఒకటి అనుకున్నారంటే.. దాన్ని పూర్తి చేయడంలో ఖచ్చితంగా అద్భుత విజయం సాధిస్తారు. రంగం ఏదైనా.. ప్రముఖులు ఎవరైనా.. మోదీ ఎదుటివారి మనసును ఇట్టే దోచేస్తారని చెప్పొచ్చు. తాజాగా 150వ గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ.. బాలీవుడ్ ప్రముఖులను ఢిల్లీకి పిలిచి మరీ మీటింగ్ పెట్టారు. అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, కంగనా రనౌత్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, రాజ్ కుమార్ హిరానీ, ఇంతియాజ్ అలీ వంటి దిగ్గజాలు ఎందరో ప్రధాని మోదీ తీరుకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ బాలీవుడ్ సెలబ్రిటీలందరూ తమ ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ.. ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు.

కళలు.. కళాకారులను.. సినిమా రంగానికి ఇంతటి గౌరవం ఇచ్చింది మోదీ ప్రభుత్వమేనని.. గాంధీ సిద్ధాంతాల్ని, మార్గాన్ని తప్పకుండా దేశ ప్రజలకు వివరిస్తామంటూ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. గాంధీజీ గురించి ప్రధాని చెప్పిన తీరు అమోఘమని.. గాంధీ 2.0 అవసరమేమోననిపిస్తోందని బాలీవుడ్ బాద్షా షారుక్ అభిప్రాయపడితే.. గాంధీ విధివిధానాల మీద మరిన్ని సినిమాలు చేయమన్నారంటూ ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే ఈ మీటింగ్‌‌తో రహస్యంగా రాజకీయ వ్యహారచన ఒకటి జరిగిందని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. బాలీవుడ్‌లో కొందరికి వామపక్ష భావజాలం ఎక్కువ.. దానికి భిన్నంగా మోదీ తనకంటూ ఓ దళాన్ని తయారు చేసుకోవడానికి ముందడుగు వేశారని చర్చ జరుగుతోంది. తనకు అండగా ఉండమని అడగడం కంటే.. నీతి బోధనలతో మనసులు గెలుచుకోవడం మోదీకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఈ మీటింగ్ పెట్టారని.. అందులోనూ వామపక్ష భావజాలం ఉన్న వారెవరినీ కూడా మీటింగ్‌కు ఆహ్వానించలేదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.

మరోవైపు మహారాష్ట్రకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో బాలీవుడ్ ఖాన్ల ద్వయం ద్వారా ప్రజలకు పార్టీని మరింత చేరువ చేసే ప్రయత్నంలో ఇదొక ఎత్తుగడని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu