హస్తినకు చేరిన ‘ఆర్టీసీ సమ్మె’.. కేంద్రం ఏమంటోంది?

హస్తినకు చేరిన 'ఆర్టీసీ సమ్మె'.. కేంద్రం ఏమంటోంది?

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళసై సౌందరాజన్.. తొలిసారిగా మోదీ-షా ద్వయాన్ని కలిశారు. టీఎస్ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ మీటింగ్ జరగ్గా.. తెలంగాణ ప్రభుత్వం గురించి కొన్ని కీలకాంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలంగాణ సమ్మెపై తీవ్రంగా స్పందించిన కేంద్రం హఠాత్తుగా గవర్నర్‌ను ఢిల్లీకి పిలిపించి ఆమె నుంచి వివరాలను తెలుసుకుంది. రాష్ట్రానికి తాను కొత్త గవర్నర్ అయినందున ఈ విషయంలో తటస్థ వైఖరిని అవలంభించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎలాంటి ఫిర్యాదుల జోలికి పోకుండా రాష్ట్రంలోని […]

Ravi Kiran

| Edited By: Anil kumar poka

Oct 16, 2019 | 7:18 PM

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళసై సౌందరాజన్.. తొలిసారిగా మోదీ-షా ద్వయాన్ని కలిశారు. టీఎస్ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ మీటింగ్ జరగ్గా.. తెలంగాణ ప్రభుత్వం గురించి కొన్ని కీలకాంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలంగాణ సమ్మెపై తీవ్రంగా స్పందించిన కేంద్రం హఠాత్తుగా గవర్నర్‌ను ఢిల్లీకి పిలిపించి ఆమె నుంచి వివరాలను తెలుసుకుంది. రాష్ట్రానికి తాను కొత్త గవర్నర్ అయినందున ఈ విషయంలో తటస్థ వైఖరిని అవలంభించినట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎలాంటి ఫిర్యాదుల జోలికి పోకుండా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను మోదీ-షాలకు వివరించినట్లు చెబుతున్నారు. అటు ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన సమస్య గనుక బీజేపీ ప్రభుత్వం కూడా దీనిపై ఆచి తూచి స్పందించే ధోరణిలో ఉంది. అయితే రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు కొందరు యదార్ధ స్థితిని మోదీ-షా ద్వయానికి సమాచారం పంపినట్లు తెలుస్తోంది. మొన్న మొన్నటి వరకు తమిళనాడులో తమ పార్టీకే చెందిన సౌందరాజన్.. ఈ సమ్మె పరిష్కారంలో తనవంతు పాత్రను పోషించవచ్చునని వారు భావిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే.. హుజుర్‌నగర్ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలకు గండి పడుతుందనే ఉద్దేశంతో బీజేపీ పెద్దలు వెనకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే గవర్నర్ సౌందరాజన్ రాష్ట్రంలోని పరిస్థితులను మోదీ-షా ద్వయానికి వినిపించినా.. వారు ఇప్పటివరకు దీనిపై ఎటువంటి ప్రస్తావనా చేయలేదు. ఏది ఏమైనా సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా నిలిచే ఈ ద్వయం తెలంగాణపై ప్రత్యేక నజర్ వేశారని చెప్పవచ్చు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu