Teacher Recruitment Scam: బెంగాల్‌లో భారీ స్కాం.. మంత్రిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు..

కోల్‌కతాలోని ఆయన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. పార్థ ఛటర్జీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు.

Teacher Recruitment Scam: బెంగాల్‌లో భారీ స్కాం.. మంత్రిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు..
Partha Chatterjee
Follow us

|

Updated on: Jul 23, 2022 | 11:26 AM

Bengal SSC Scam: స్కూల్ సర్వీస్ కమిషన్ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్టు చేసింది. కోల్‌కతాలోని ఆయన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. పార్థ ఛటర్జీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ విచారణను ఈడీ ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి పలువురి ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ (Partha Chatterjee) అత్యంత సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటిపై దాడులు చేసింది. ఈ తనిఖీల్లో ఏకంగా రూ.20 కోట్ల నగదు పట్టుబడినట్లు ఈడీ వెల్లడించింది. అయితే అర్పితా ముఖర్జీ ఇంట్లో ఎక్కడ చూసినా రూ.500ల రూ.2 వేల నోట్ల కట్టలే దర్శనమిచ్చినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని స్కూల్ సర్వీస్ కమిషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్ రిక్రూట్మెంట్ స్కామ్‌ విచారణలో కీలక పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. 20కి పైగా మొబైల్ ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఛటర్జీతో పాటు విద్యాశాఖ సహాయ మంత్రి పరేష్‌ సి అధికారి, ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్య తదితరుల నివాసాలపై కూడా ఈడీ దాడులు చేసింది.

ఇవి కూడా చదవండి

స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్ల నుంచి కీలక పత్రాలు, అనుమానాస్పద కంపెనీల సమాచారం, ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ కరెన్సీ, బంగారం కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. అధికార పార్టీ టీఎంసీకి సంబంధించిన కీలక నేత, మాజీ మంత్రి అరెస్టు కావడం రాష్ట్రంలో కలకలం రేపింది.

బెంగాల్‌లో గ్రూప్ ‘సి’, ‘డి’ ఉద్యోగులు, 9 నుంచి 12వ తరగతి అసిస్టెంట్ టీచర్లు, ప్రైమరీ టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయన్న పిటిషన్లను విచారించిన కోల్‌కతా హైకోర్టు దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. కాగా.. ఈ కేసులో మనీలాండరింగ్‌పై ఈడీ విచారణ జరుపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..