Mamata Banerjee: బెంగాల్‌లో మళ్లీ వేడెక్కిన రాజకీయాలు.. నేడు సీఎం మమతా బెనర్జీ నామినేషన్‌..

Bhabanipur Assembly by-election: పశ్చిమ బెంగాల్‌లో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. బెంగాల్‌లోని మూడు అసెంబ్లీ స్థానాలకు 30న ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో..

Mamata Banerjee: బెంగాల్‌లో మళ్లీ వేడెక్కిన రాజకీయాలు.. నేడు సీఎం మమతా బెనర్జీ నామినేషన్‌..
Mamata Banerjee
Follow us

|

Updated on: Sep 10, 2021 | 9:24 AM

Bhabanipur Assembly by-election: పశ్చిమ బెంగాల్‌లో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. బెంగాల్‌లోని మూడు అసెంబ్లీ స్థానాలకు 30న ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఘన విజయం సాధించింది. అయితే.. నందిగ్రామ్‌లో పోటీచేసిన సీఎం మమతా.. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్‌ పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం మమత శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీబేపీ నేత సువేందు అధికారిని ఓడించడానికి నందిగ్రామ్‌ నుంచి పోటీచేశారు. అయితే గట్టిపోటీనిచ్చిన ఆమె కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అయితే.. ఆమె ఏ సభకూ ఎన్నిక కాకుండానే మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టారు. అయితే.. రాజ్యాంగం ప్రకారం మమతా ఆరు నెలల్లోగా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో భవానీపూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర వ్యవ‌సాయ మంత్రి సోబ‌న్‌దేవ్ చ‌టోపాధ్యాయ్.. మ‌మ‌తా బెన‌ర్జీ కోసం త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో భవానీపూర్‌తోపాటు మరో రెండు స్థానాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో మమతా బెనర్జీపై పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తన అభ్యర్థిని బరిలో నిలపనుంది. అయితే.. ఈ సారి కూడా మమత ఓటమి చెందితే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుందని రాజకీయ నేతలు పేర్కొంటున్నారు.

కాగా.. గత శనివారం కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్‌లో భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ నియోజకవర్గాల్లో, ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 30న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6 విడుదల కాగా.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 13గా ఎన్నికల సంఘం ప్రకటించింది.

Also Read;

Hyderabad: దిశ తరహాలోనే ఎన్‌కౌంటర్‌ చేయండి.. చిన్నారి హత్యపై స్థానికుల తిరుగుబాటు.. సైదాబాద్‌లో ఉద్రిక్తత

Hyderabad: హైదరాబాద్‌లో ఉన్మాది అరాచకం.. చిన్నారిపై కన్ను.. ఆ తర్వాత ఎత్తుకెళ్లి..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!