Maharashtra: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రజల హృదయాలను గెలవలేరు.. మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్

ఏక్ నాథ్ షిండే నేతృతంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంపై పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) షాకింగ్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర(Maharashtra) ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని అన్నారు. మరో ఆరు నెలల్లో ఈ పరిణామాలు...

Maharashtra: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రజల హృదయాలను గెలవలేరు.. మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్
Mamata Banerjee
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 05, 2022 | 7:45 AM

ఏక్ నాథ్ షిండే నేతృతంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంపై పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) షాకింగ్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర(Maharashtra) ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని అన్నారు. మరో ఆరు నెలల్లో ఈ పరిణామాలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాగే కొనసాగుతుందని తాను భావించడం లేదని, అనైతికంగా, అప్రజాస్వామికంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రజల హృదయాలను గెలవలేరని తీవ్రంగా స్పందించారు. ‘ఇండియా టుడే క్లాన్‌కేవ్‌ ఈస్ట్‌-2022’ కార్యక్రమంలో పాల్గొ్న్న మమతా ఈ స్టేట్మెంట్స్ చేశారు. రానున్న రోజుల్లోనూ మీడియా నిష్పాక్షికంగా పనిచేసి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని ఆకాంక్షించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, నుపుర్‌ శర్మ, హోంమంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా బీసీసీఐ ప్రధాన కార్యదర్శి కావడం గురించి ఆమె ఈ కార్యక్రమంలో మాట్లాడారు. 2024 ఎన్నికలు పాలకులను ఎన్నుకొనేందుకు కాకుండా బీజేపీను తిరస్కరించేందుకు జరుగుతాయని అభిప్రాయపడ్డారు.

బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేయవచ్చు. కానీ ఈ దేశ ప్రజలు ప్రజాస్వామ్య మార్గాలను ఉపయోగించి మిమ్మల్ని కిందకు దింపుతారు. యువత దేశ బాధ్యతలను చేపట్టాలని మీకు లేదా?’. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలంటున్న బీజేపీ.. మరెందుకు హోంమంత్రి అమిత్‌ షా కుమారుడు జై షాకు బీసీసీఐలో అత్యున్నత పదవి కట్టబెట్టింది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారు. కానీ అవి ముమ్మాటికి బీజేపీకి వ్యతిరేకమే.

ఇవి కూడా చదవండి

 – మమతా బెనర్జీ, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి

కాగా.. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల గురించి మమతా బెనర్జీ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో పోలిస్తే అధికార భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి కావడానికి అవకాశం ఉందని మమతా బెనర్జీ ఒప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఎంపికతో ఆయన తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయవలసి వచ్చింది. అయితే.. బీజేపీ తమ అభ్యర్థిగా గిరిజన మహిళను పోటీకి దింపుతామని చెప్పి ఉంటే, ఆమె పేరుపై ఏకాభిప్రాయం ఏర్పడి ఉండేదని మమతా బెనర్జీ చెప్పడంతో సందిగ్ధత నెలకొంది.

జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..