భారత-పాకిస్తాన్ మధ్య సయోధ్యకు మేం రెడీ ! యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్స్ సీక్రెట్ ప్లాన్

దాయాది దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి తాము మధ్యవర్తిత్వ పాత్ర వహిస్తామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్స్ ప్రకటించింది.  ఇది  ఆశ్చర్యకరమైన, సీక్రెట్  శాంతి ప్లాన్ గా అభివర్ణించుకుంది.

భారత-పాకిస్తాన్ మధ్య సయోధ్యకు మేం రెడీ ! యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్స్ సీక్రెట్ ప్లాన్
ప్రతీకాత్మక చిత్రం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 22, 2021 | 2:30 PM

దాయాది దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి తాము మధ్యవర్తిత్వ పాత్ర వహిస్తామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్స్ ప్రకటించింది.  ఇది  ఆశ్చర్యకరమైన, సీక్రెట్  శాంతి ప్లాన్ గా అభివర్ణించుకుంది. ఉభయ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం శాంతి నెలకొనేందుకు కుదిరిన సుదీర్ఘ రోడ్ మ్యాప్ కి  నాందిగా  కూడా పేర్కొంది. 2003 లో రెండు దేశాల మధ్య కుదిరిన  ఈ ఒప్పందాన్ని ఒకరికొకరు గౌరవించుకోవాలని, దీన్ని పాటించాలని గత నెలలో భారత-పాకిస్థాన్  దేశాల సైనికాధికారులు హాట్ లైన్ ద్వారా జరిగిన చర్చల సందర్భంలో ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన ఉన్నత స్థాయి దౌత్యాధికారి ఒకరు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఒకరోజు భారత పర్యటన కోసం ఆయన గత నెలలో ఢిల్లీని సందర్శించారు.  తమ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయేద్.. మీకు ఈ సమాచారాన్ని తెలిజేయవలసిందిగా తనను కోరారని ..భారత విదేశ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కి ఆయన వెల్లడించారు. వీరిద్దరూ ఉమ్మడి ప్రయోజనాలకు దోహదపడే అన్ని  ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యల గురించి చర్చించారని, సహకారం పెంపునకు ఉద్దేశించిన చర్యల విషయం కూడా వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని ఓ విదేశీ పత్రిక తెలిపింది.

భారత-పాకిస్తాన్ దేశాల మధ్య శాంతియుతమైన పరిస్థితులు నెలకొనాలని తాము ఆశిస్తున్నామని, గతంలోనే యూఏఈ రహస్యంగా  రూపొందించిన  ప్లాన్ మేరకే ఈ దేశాల మధ్య హాట్ లైన్ ద్వారా చర్చలు జరిగాయని సంబంధిత  వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా   మధ్య శాంతి నెలకొనడానికే కాకుండాలెబనాన్, సిరియా,  సూడాన్, లిబియా,  ఇరాక్, ఇరాన్,  ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో శాంతి సామరస్యాలు  కొనసాగేలా చూడడానికి కూడా తాము కృషి చేశామని ఆ దౌత్యాధికారి పేర్కొన్నట్టు వార్తలు వచ్చ్చాయి. అలాగే బోకో హరమ్ హింసాత్మక ఘటనలను కూడా అదుపు చేయగలిగామని ఆయన చెప్పారట. ఇలా ప్రతి అంశంలోనూ పాజిటివ్ ఫలితాలు వచ్చేలా చూశామని ఆయన చెప్పుకున్నారు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :నవీన్‌ పొలిశెట్టిగా..అంటూ వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ..జాతిరత్నాల మధ్య చిచ్చు..:warning to Naveen Polishetty Video.

ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video

వామ్మో.. లేడీ కాదు..పెద్ద కిలాడీ ! ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది : Lady Married 18 Mens Video.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?