అమెరికాలో ‘రచ్చ’ రేపిన కజిన్స్.. వాళ్ళు మన ఇండియన్సే !

రాజస్తాన్ కి చెందిన ఇద్దరు కజిన్స్….. రియాల్టీ షో…. ‘అమెరికా స్ గాట్ టాలెంట్ షో’ లో ‘రచ్చ’ చేశారు. తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అందరి  హృదయాలనూ ‘కొల్లగొట్టారు’. రాజస్తాన్ లోని ఫతేపూర్ కి చెందిన 9 ఏళ్ళ రిహాన్, తన కజిన్ అయిన 21  ఏళ్ళ షకీర్ తో కలిసి రచ్ఛ చేస్తూ.. ‘చిచ్చరపిడుగే’ అయ్యాడు.  అతని రిథమిక్ డ్యాన్స్, స్టంట్స్, ముఖం మీద చెరగని చిరునవ్వు, విల్లులా తన బాడీని వంచేస్తూ.. . […]

  • Updated On - 7:48 pm, Thu, 11 June 20 Edited By: Pardhasaradhi Peri
అమెరికాలో 'రచ్చ' రేపిన కజిన్స్.. వాళ్ళు మన ఇండియన్సే !


రాజస్తాన్ కి చెందిన ఇద్దరు కజిన్స్….. రియాల్టీ షో…. ‘అమెరికా స్ గాట్ టాలెంట్ షో’ లో ‘రచ్చ’ చేశారు. తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అందరి  హృదయాలనూ ‘కొల్లగొట్టారు’. రాజస్తాన్ లోని ఫతేపూర్ కి చెందిన 9 ఏళ్ళ రిహాన్, తన కజిన్ అయిన 21  ఏళ్ళ షకీర్ తో కలిసి రచ్ఛ చేస్తూ.. ‘చిచ్చరపిడుగే’ అయ్యాడు.  అతని రిథమిక్ డ్యాన్స్, స్టంట్స్, ముఖం మీద చెరగని చిరునవ్వు, విల్లులా తన బాడీని వంచేస్తూ.. . ‘విరిచేస్తూ’.. ఇఛ్చిన ప్రదర్శన వావ్ అనిపించింది. ఆ ఇద్దరి అమేజింగ్ స్కిల్స్ చూసి జడ్జీలైన సోఫియా వెర్గరా, హీదీ క్లమ్, సైమన్ కోవెల్  తో బాటు  అందర్నీ అబ్బురపరిచింది. చప్పట్లతో హాలంతా మరు మోగింది. రెండు రోజుల క్రితమే యూట్యూబ్ లో ఈ వీడియో షేర్ కాగా.. ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఆ కుర్రాళ్ళ కనువిందు వీడియో మనం కూడా చూడాల్సిందే !