మోదీ చేతిలోని కర్రలాంటి పరికరం ఇదే..! దాని వల్ల ఇన్ని ప్రయోజనాలా..?

ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ మధ్య భేటీ విజయవంతంగా ముగిసింది. మహాబలిపురంలో ఇద్దరు నేతలూ.. చర్చలు జరిపారు. ఈ క్రమంలో.. జిన్‌పింగ్‌తో తొలి రోజు సమావేశమైన మోదీ.. సముద్ర తీరాన వాకింగ్ చేశారు. ఆ వాకింగ్ అనంతరం.. ఆయన తీరంలో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేశారు. మోదీ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. ఒక దేశ ప్రధాని అయి ఉండి.. ఇలా చేయడంతో అందరూ.. ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తారు. కాగా.. మోదీ […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:45 pm, Sun, 13 October 19
మోదీ చేతిలోని కర్రలాంటి పరికరం ఇదే..! దాని వల్ల ఇన్ని ప్రయోజనాలా..?

ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ మధ్య భేటీ విజయవంతంగా ముగిసింది. మహాబలిపురంలో ఇద్దరు నేతలూ.. చర్చలు జరిపారు. ఈ క్రమంలో.. జిన్‌పింగ్‌తో తొలి రోజు సమావేశమైన మోదీ.. సముద్ర తీరాన వాకింగ్ చేశారు. ఆ వాకింగ్ అనంతరం.. ఆయన తీరంలో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేశారు. మోదీ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. ఒక దేశ ప్రధాని అయి ఉండి.. ఇలా చేయడంతో అందరూ.. ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తారు. కాగా.. మోదీ చెత్త ఏరుతున్న సమయంలో.. ఒక చేతిలో ప్లాస్టిక్ కవర్.. మరో చేతిలో కర్రలాంటి ఓ వస్తును అందరూ.. నోటీస్ చేశారు. అందేటన్న ఆసక్తి అందరిలోనూ కలిగింది. దీంతో.. ఆ వస్తువు గురించి.. తన ట్విట్టర్‌లో తెలియజేశారు మోదీ.

నా చేతిలో ఉన్న కర్రలాంటి వస్తువును ఆక్యు ప్రెజర్ రోలర్ అంటారని.. దాన్ని చేతిలో పట్టుకుని తిప్పడం వల్ల.. నరాలను ఉత్తేజితమవుతాయని తెలియజేశారు. అరిచేతుల్లో, అరి కాళ్లల్లో ఉన్న వేలాది నరాలు ఉత్తేజితం అవుతాయని.. దీని వల్ల శరీరానికి రక్త ప్రసరణ పెరుగుతుందని చెప్పారు. ఒత్తిడి, టెన్షన్లను తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు మోదీ.