నీకు కరెంట్ కావాలా? అయితే నాకు ఓటు వేశావా ..? నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు! యూపీలో ఓ బీజేపీ ఎమ్మెల్యే వితండ వాదన

'నీకు నీ ఇంట్లో కరెంట్ కావాలా.? నీ ఇంట్లో లైట్లు వెలగాలా..? అయితే గంగానది మీదో, నీ కొడుకు మీదో ఒట్టు వేసి చెప్పు.. నాకు నీ ఓటు వేశావా..? అన్నాడు యూపీలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే !ఓ గ్రామీణుడితో కాట్రా నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన వీర్ విక్రమ్ సింగ్ గారి వితండ వాదన ఇది.. షాజహాన్ పూర్...

నీకు కరెంట్ కావాలా? అయితే నాకు ఓటు వేశావా ..? నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు! యూపీలో ఓ బీజేపీ ఎమ్మెల్యే వితండ వాదన
Want Electricity Swear You Voted For Me

‘నీకు నీ ఇంట్లో కరెంట్ కావాలా.? నీ ఇంట్లో లైట్లు వెలగాలా..? అయితే గంగానది మీదో, నీ కొడుకు మీదో ఒట్టు వేసి చెప్పు.. నాకు నీ ఓటు వేశావా..? అన్నాడు యూపీలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే !ఓ గ్రామీణుడితో కాట్రా నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన వీర్ విక్రమ్ సింగ్ గారి వితండ వాదన ఇది.. షాజహాన్ పూర్ లో ఇటీవల జరిగిన ట్రీ ట్రాన్స్ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇలా తన ఓటుకు, సెంటిమెంటుకు ముడి పెట్టాడు. తన ఇంట్లో కరెంట్ లేదని, లైట్లు పెట్టించాలని ఆ వ్యక్తి చేసిన అభ్యర్థనకు ఈ ఎమ్మెల్యే.. నాకు నీ ఓటు పడిందా అని ప్రశ్నించాడు. అప్పుడే నీకు ఇలా హక్కు ఉంటుందన్నాడు. తనను ఫూల్ (మూర్ఖుడిని) చేయొద్దని, తన తండ్రి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడని, తానిప్పుడు శాసన సభ్యుడినని విక్రమ్ సింగ్ చెప్పాడు. ప్రతి పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు పడ్డాయో తనకు తెలుసునని, నాకు తెలియదనుకోవడం నీ పొరబాటని పేర్కొన్నాడు. ఈ ఎమ్మెల్యే ప్రశ్నలకు బిత్తరపోవడం ఆ గ్రామీణుడిడైంది. ఇలా తననే ఎదురు ప్రశ్న వేస్తాడని పాపం ఆ వ్యక్తి భావించలేదు.

ఆ తరువాత మీడియాతో మాట్లాడిన వీర్ విక్రమ్ సింగ్.. ఆ వ్యక్తి తనపై ఒత్తిడి తెచ్చాడని, నిజానికి అలాంటి లైట్ల ధర 10 లక్షలవుతుందని చెప్పాడు. అంటే బహిరంగ స్థలాల్లో ఇలా లైటింగ్ ఏర్పాటుకు ప్రభుత్వ పథకాలు ఉంటాయని చెప్పాడు. ఆ పథకాల కింద ఈ విధమైన కార్యక్రమాలను చేపట్టవచ్చునన్నాడు . ఏమైనా ఈ ఎమ్మెల్యే గారి వితండ వాదన వీడియోకెక్కి వైరల్ అవుతోంది.

మరిన్ని ఇక్కడ చూడండి : స్కూల్ విద్యార్థులకు కండోమ్స్ కొత్త సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీ..సంచలన నిర్ణయం:Condoms To Students Video.

 COVID-19 Cases Rising Live Video: కరోనా టెర్రర్..! ఇంకా ఎంత కాలం ఈ కరోనా కొత్త వేరియంట్ వణికిపోతున్న ప్రజలు..లైవ్ వీడియో.

 Love Failure Viral Video: ప్రియుడికి పెళ్లి.. గుండెలు పగిలేలా ప్రేయసి రోదన.!ప్లీజ్ ఒక్కసారి బయటకి రా అంటూ

 విస్తారంగా దంచికొడుతున్న వర్షాలు..తడిసిముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు లైవ్ వీడియో..:Heavy Rains in Telugu States Live Video.

Click on your DTH Provider to Add TV9 Telugu