PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. ఈ రోజుతో చివరి రోజు.. లేదంటే డబ్బులు జమకావు..!

PMKY eKYC Deadline Alert: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రూ.2 వేలను కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తోంది. ఈ మొత్తం రైతుల ఖాతాల జమ కావాలంటే ముందుగా కేవైసీ పూరించాల్సి ఉంటుంది.

PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. ఈ రోజుతో చివరి రోజు.. లేదంటే డబ్బులు జమకావు..!
Pm Kisan
Follow us

|

Updated on: Jul 31, 2022 | 2:54 PM

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana) కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఖాతాలకు రూ. 2000 వాయిదాను పంపుతుంది. మీరు కూడా 12వ వాయిదా కోసం ఎదురు చూస్తున్నట్లయితే.. మీ డబ్బు ఎప్పుడు వస్తుందో మాకు తెలుసుకోండి. 31 మే 2022 న 11వ విడతలో రూ. 2000లను 10 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు ప్రధాని మోదీ బదిలీ చేసిన సంగతి తెలిసిదే. అయితే 12 వ విడతలో రూ. 2 వేలను  1 సెప్టెంబర్ 2022 తర్వాత రైతుల ఖాతాకు బదిలీ చేసే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత ఏప్రిల్- జూలై మధ్య వస్తుంది. రెండవది ఆగస్టు- నవంబర్ మధ్య వస్తుంది. 12వ విడత 1 సెప్టెంబర్ నుంచి 10 సెప్టెంబర్ వరకు రావచ్చు.

e-KYC చివరి రోజు ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వం e-KYC (e-KYC) పూర్తి చేసేందుకు గడవులు ఇవాళ్టితో ముగుస్తోంది. గడువు తేదీని ఇప్పటికే ఓ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించే ఛాన్స్ లేదు. మీరు ఇంకా e-KYC చేయకుంటే మీరు PM కిసాన్ నిధి ప్రయోజనాన్ని పొందలేరు.

మీ e-KYC ఎలా చేయాలి

  • ముందుగా PM కిసాన్ యోజన వెబ్‌సైట్ కి వెళ్లండి.
  • ఇక్కడ ఫార్మర్స్ కార్నర్‌లో E-KYCపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు ఇక్కడ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, సెర్చ్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఈ OTPని సమర్పించుపై క్లిక్ చేయండి.
  • ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ OTPని నమోదు చేయండి. మీ e-KYC పూర్తయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..