బీజేపీలోకి విజయశాంతి… డిసెంబర్ 7న చేరిక… వెల్లడించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో విజయశాంతి డిసెంబర్ 6 సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాను విజయశాంతి ప్రత్యేకంగా శాలువాతో సన్మానించారు.

బీజేపీలోకి విజయశాంతి... డిసెంబర్ 7న చేరిక... వెల్లడించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...
అమిత్ షాను కలిసిన విజయశాంతి మరియు బిజెపి నేతల
Follow us

| Edited By:

Updated on: Dec 06, 2020 | 8:59 PM

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో విజయశాంతి డిసెంబర్ 6 సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాను విజయశాంతి ప్రత్యేకంగా శాలువాతో సన్మానించారు. అనంతరం విజయశాంతితో పాటు సమావేశానికి హాజరైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎంపీ వివేక్‌తో అమిత్ షా మాట్లాడారు. గంట సేపు వారి సమావేశం సాగింది. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 7 ఉదయం 11 గంటలకు విజయశాంతి బీజేపీలో చేరుతారని ప్రకటించారు. విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ అసలైన తెలంగాణ ఉద్యమకారులను విస్మరిస్తోందని విమర్శించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై….

జీహెచ్ఎంసీ ఫలితాల పట్ల అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారని బండి సంజయ్ అన్నారు. అలాగే, పార్టీ నేతల్ని, శ్రేణుల్ని అభినందించారని తెలిపారు. రాజకీయ దూకుడును కొనసాగించమని సూచించారని తెలియజేశారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ మంచి ఫలితాలను రాబట్టాలని దిశానిర్దేశం చేశారని వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని సూచించారని అన్నారు.