కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ అవసరం, సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా, 6 లేదా 8 వారాల విరామం ఉత్తమం

కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ అవసరం, సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా, 6 లేదా 8 వారాల విరామం ఉత్తమం

కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకునే డోసుల మధ్య గ్యాప్ ఉండాలని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు. రెండు డోసుల..

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Jan 16, 2021 | 11:06 AM

Covid Vaccination: కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకునే డోసుల మధ్య గ్యాప్ ఉండాలని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు. రెండు డోసుల మధ్య 28 రోజులకు పైగా విరామం ఉన్న పక్షంలో దీని సామర్థ్యం పెరుగుతుందని ఆయన చెప్పారు. ఈ  విషయమై ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ జాదవ్ మాట్లాడుతూ కొన్ని వారాల పాటు ఈ గ్యాప్ పెరిగితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. నాలుగు వారాల గ్యాప్ ఉన్నా మంచిదే..లేదా ఆరు లేక 8 లేదా 10 వారాలు విరామం ఉన్న పక్షంలో మరీ మంచిదని ఆయన వివరించారు. ఫేజ్-3లో క్లినికల్ ట్రయల్స్ ను 28 రోజుల గ్యాప్ తో నిర్వహించామన్నారు. రెండు డోసులు త్వరగా తీసుకుంటే దీన్ని తీసుకున్నవారికి 70 శాతం ప్రొటెక్షన్ ఉంటుంది.. ఎక్కువకాలం రక్షణ పొందాలనుకుంటే 6 నుంచి 8 వారాల తరువాత మరో డోసు తీసుకుంటే మంచి అని ఆయన పేర్కొన్నారు.

కోవిడ్ నుంచి కోలుకున్నవారు కూడా వాక్సిన్ తీసుకోవలసిందే అని సురేష్ జాదవ్ తెలిపారు. కొందరికి రెండుసార్లు ఈ మహమ్మారి సంక్రమించడమే ఇందుకు కారణమన్నారు. మరో విషయం.. రెండు టీకామందులనూ మిశ్రమం చేయరాదు.. ప్రతి డోసు డిఫరెంట్ వ్యాక్సిన్ నుంచి వచ్చింది.. టెక్నాలజీ కూడా డిఫరెంట్ అని ఆయన తేల్చి చెప్పారు. మరి ఇన్ని విషయాలను పేరు పొందిన నిపుణులు గానీ, ఇండియన్ మెడికల్ రీసెర్చ్ సంస్థ గానీ ఇప్పటివరకు ఎందుకు వివరించలేదని అంటున్నారు. ఈ విషయంలో ప్రజలను జాగృతపరచవలసి ఉందంటున్నారు.  ఇక  భారత్ బయో టెక్ వారి కోవాగ్జిన్ కి కూడా ఈ సూత్రం వర్తిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read:

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, ఈ ఉదయం పదిన్నరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి దూరం, 20న వాషింగ్టన్ కు వీడ్కోలు పలకనున్న డొనాల్డ్ ట్రంప్, ఇక నేరుగా ఫ్లోరిడాకు

కాపు ఉద్యమ నేత ముద్రగడను కలవనున్న బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. బీజేపీలో చేరికపై చర్చ..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu