కర్ణాటకలో జైలు నుంచి త్వరలో విడుదల కానున్న శశికళకు అస్వస్థత, బెంగుళూరులోని ఆసుపత్రికి తరలింపు.

బెంగుళూరులోని పరప్పన అగ్రహారం జైలు నుంచి విడుదల కానున్న శశికళ జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెను బుధవారం..

  • Umakanth Rao
  • Publish Date - 7:13 pm, Wed, 20 January 21
కర్ణాటకలో జైలు నుంచి త్వరలో విడుదల కానున్న శశికళకు అస్వస్థత, బెంగుళూరులోని ఆసుపత్రికి తరలింపు.

బెంగుళూరులోని పరప్పన అగ్రహారం జైలు నుంచి విడుదల కానున్న శశికళ జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెను బుధవారం ఈ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె కొన్ని రోజులుగా ఫీవర్, దగ్గుతో బాధ పడుతున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితకు సన్నిహితురాలైన శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.  కోర్టుకు 10 కోట్ల రూపాయల జరిమానా చెల్లించిన శశికళ ఈ నెల 27 న విడుదల కావలసి ఉంది. కాగా ఆమెని అన్నా డీఎంకే లో చేర్చుకునే ప్రసక్తి లేదని తమిళనాడు సీఎం పళనిస్వామి ఇటీవల ప్రకటించారు.  కాగా-ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని బెంగుళూరు ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.