Uttar Pradesh: అమ్మో రౌడీ కోతులు.. మూడు అంతస్థుల భవనంపై నుంచి పడినా అతన్ని వదల్లేదు..!

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రౌడీల్లా మారి.. ప్రజలపై దాడులకు తెగ బడుతున్నాయి.

Uttar Pradesh: అమ్మో రౌడీ కోతులు.. మూడు అంతస్థుల భవనంపై నుంచి పడినా అతన్ని వదల్లేదు..!
Monkeys
Follow us

|

Updated on: Jul 31, 2022 | 10:43 PM

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రౌడీల్లా మారి.. ప్రజలపై దాడులకు తెగ బడుతున్నాయి. కోతులు విజృంభిస్తుండటంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇంటి బయటకే కాదు.. ఇళ్ల పైకి వెళ్లినా దాడులు చేస్తున్నాయి. చిన్న, పెద్ద, ముసలి అనేదే లేకుండా.. కనిపించడమే ఆలస్యం అటాక్ చేస్తున్నాయి. తాజాగా కోతి దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బరేలీలోని మీర్‌గంజ్‌లోని మొహల్లా ఖాన్‌పూర్‌లో నివాసం ఉంటున్న ఆదేశ్ పరాషరి (21) ఏదో పని నిమిత్తం తన టెర్రస్‌ పైకి వెళ్లాడు. అప్పటికే టెర్రపై తిష్టవేసిన కోతుల గుంపు.. అతినిపై దాడి చేశాయి. కోతుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో అతను 3వ అంతస్తు నుంచి కింద పడిపోయాడు. అయినప్పటికీ ఆ కోతులు అతన్ని వదల్లేదు. కిందకు వచ్చి మరీ.. అతన్ని రక్కి రక్కి వదిలేశాడు. అయితే, కోతులు దాడి చేస్తుండగా గమనించిన కొందరు.. వాటిని ఎలాగోలా తరిమేశారు. అనంతరం మీర్‌గంజ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుత అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

కోతుల బెడదపై ప్రజల ఆగ్రహం.. కోతుల బెడద విపరీతంగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు బడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దాడులు చేస్తున్నాయని బాధిత ప్రజలు వాపోతున్నారు. కోతుల మంద మనుషులపై దాడులు చేస్తున్నా అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా