యూపీలో దారుణం.. నర్సుపై సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత కారం పోసి..

|

Nov 29, 2024 | 4:23 PM

చుర్ఖీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఆమె స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్నట్లు మహిళ భర్త తెలిపారు. ఆమె గురువారం ఉదయం 9 గంటల సమయంలో స్కూటర్‌పై ఆసుపత్రికి వెళ్తుండగా కొంతమంది వ్యక్తులు ఆమెను అడ్డగించి పొలాల్లోకి బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలిపారు.

యూపీలో దారుణం.. నర్సుపై సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత కారం పోసి..
Crime News
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఓ నర్సుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. మరో మరో నలుగురు ఆమెను పట్టుకుని బంధించారు. అనంతరం ఆమెపై కర్రతో దాడి చేశారని, ఆపై ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో కారం పొడి పోసి, కర్రను చొప్పించి తీవ్రంగా దాడిచేసినట్లు బాధితురాలి కుటుంబం పేర్కొంది. ఈ దారుణ ఘటన చుర్ఖి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది.. అయితే ఆ మహిళ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అతని కుటుంబ సభ్యులు ఆమెను కొట్టారని పోలీసులు చెబుతున్నారు. ఆమె కొన్ని తీవ్ర ఆరోపణలు చేసిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చుర్ఖీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఆమె స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్నట్లు మహిళ భర్త తెలిపారు. ఆమె గురువారం ఉదయం 9 గంటల సమయంలో స్కూటర్‌పై ఆసుపత్రికి వెళ్తుండగా కొంతమంది వ్యక్తులు ఆమెను అడ్డగించి పొలాల్లోకి బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆమె తనకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పిందని.. ఒక వ్యక్తి, అతని మేనల్లుడు.. మరికొందరు ఆమెను కొట్టినట్లు చెప్పిందన్నారు.. నలుగురు వ్యక్తులు ఆమెను పట్టుకొనగా.. ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పిందని తెలిపారు.

ఈ ఘటనపై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (జలాన్) ప్రదీప్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. ఒక మహిళను కొట్టినట్లు సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిందన్నారు.

మహిళ అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉందన్నారు.. ఆ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు ఆమెను కొట్టారన్నారు. పోలీసు బృందం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లిందని.. ఈ క్రమంలో ఆమె కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేసిందన్నారు.. ఈ ఘటనపై తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. అసలు విషయం త్వరలోనే తెలుస్తుందని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..