చనిపోయిన కొడుకుకు అంత్యక్రియలకు సిద్ధమైన తండ్రి.. పోలీసు ఎంట్రీతో..

ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ తండ్రి కొడుకును హత్య చేశాడు. కొడుకు రోజూ తాగి వచ్చి వేధింపులకు పాల్పడ్డుతున్నాడని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాన్పూర్‌లోని పంకీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

చనిపోయిన కొడుకుకు అంత్యక్రియలకు సిద్ధమైన తండ్రి.. పోలీసు ఎంట్రీతో..
Arrest
Follow us

|

Updated on: Sep 24, 2024 | 4:19 PM

ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ తండ్రి కొడుకును హత్య చేశాడు. కొడుకు రోజూ తాగి వచ్చి వేధింపులకు పాల్పడ్డుతున్నాడని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాన్పూర్‌లోని పంకీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కాశీరాం కాలనీలో నివాసముంటున్న రంజిత్ కుమార్‌ను కన్నతండ్రే హతమార్చినట్లు పోలీసలు తెలిపారు. డ్రగ్స్‌, మద్యానికి బానిస కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అతని వేధింపులు భరించలేక హత్య చేసినట్లు పోలీసుల కస్టడీలో అంగీకరించాడు నిందితుడు.

రంజిత్ కుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఆ తర్వాత రోజూ ఇంట్లో గొడవలు జరిగేవి. ప్రతి రోజూ కొడుకు తాగి ఇంటికి వచ్చేవాడని, ఒక్కోసారి అతనిపై అసభ్యంగా ప్రవర్తించి, కొట్టేవాడని, కొన్నిసార్లు మిగతా కుటుంబ సభ్యులను వేధించేవాడని నిందితుడైన తండ్రి పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలోనే గత శుక్రవారం(సెప్టెంబర్ 20) మద్యం సేవించి ఇంటికి చేరుకున్న రంజిత్ ఇంటి పనుల విషయమై తండ్రితో గొడవ పడ్డాడు. దీనిపై తండ్రి అభ్యతరం వ్యక్తం చేయడంతో గొడవకు దిగాడు. దీంతో ఆగ్రహించిన తండ్రి మద్యం మత్తులో ఉన్న కొడుకును బెల్టులతో తీవ్రంగా కొట్టాడు.

తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి.. కొడుకును తీవ్రంగా కొట్టి, బెల్టుతో గొంతు బిగించి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత తండ్రి చాలా పశ్చాత్తాపపడ్డాడు. విషయం బయటకు పొక్కకుండా తన కొడుకు మితిమీరిన మద్యం సేవించి మత్తులో చనిపోయాడని అందరిని నమ్మించేందుకు ప్రయత్నించాడు తండ్రి. తన కుమారుడి హఠాన్మరణం గురించి చుట్టుపక్కల వారికి తెలిపిన తండ్రి.. పోలీసులకు చేరకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే స్థానికుల ద్వారా విషయం పంకి పోలీస్ స్టేషన్‌కు చేరడంతో, సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. అర్థరాత్రి రాత్రి తండ్రీ కొడుకుల మధ్య భీకర గొడవ జరిగినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు.

దీని ఆధారంగా, పోలీసులు రంజిత్‌ తండ్రిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌లో విచారించారు. తరువాత అతను మొత్తం కథను పోలీసులకు వివరించాడు. ఈ ఘటనలో పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. పంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్షీరామ్ కాలనీలో నివాసముంటున్న 22 ఏళ్ల రోహిత్ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో రోహిత్ ఆటో నడుపుతూ ఇంటికి చేరుకున్నాడు. ఇక్కడికి రాగానే తండ్రి రంజిత్‌పై దుర్భాషలాడాడు. ఈ గొడవలో తండ్రి చేతికి లెదర్ బెల్టు తగలడంతో ఆగ్రహింతో కొడుకును కొట్టాడు. అనంతరం గొంతుకు బెల్టు బిగించి చంపాడు. తండ్రి నేరం ఒప్పుకోవడంతో పోలీసులు తదుపరి విచారణ ప్రారంభించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..