UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో ‘లుంగీ, టోపీ’ రచ్చ.. బీజేపీ నేతపై భగ్గుమంటున్న ప్రతిపక్ష నేతలు.. అసలు కథ ఏంటంటే..!

UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో ‘లుంగీ, టోపీ’ రచ్చ.. బీజేపీ నేతపై భగ్గుమంటున్న ప్రతిపక్ష నేతలు.. అసలు కథ ఏంటంటే..!
Prasad Maurya

UP Elections 2022: యూపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా ఇష్టారీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

Shiva Prajapati

|

Dec 06, 2021 | 7:15 AM

UP Elections 2022: యూపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా ఇష్టారీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా లుంగీ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ప్రచారాలు ప్రసంగాలు చేస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు. ఈ క్రమంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య. లుంగీ, టోపీ ధరించిన వ్యక్తులు గతంలో శాంతిభద్రతలకు సవాలుగా మారేవారంటూ బాంబ్ పేల్చారు. 2017కు ముందు లుంగీలు ధరించిన వ్యక్తులు వ్యాపారుల్ని తుపాకులతో బెదిరించేవారని, స్థలాలు కబ్జా చేసేవారని కామెంట్ చేశారాయన. అయితే, బీజేపీ ప్రభుత్వం వచ్చాక అలాంటి నేరస్థులు కనిపించట్లేదన్నారు మౌర్య.

కాగా, ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ నేతలు. యూపీలో ఉండే హిందువుల్లో సగం మంది లుంగీ ధరిస్తారని, మౌర్య వ్యాఖ్యల ప్రకారం లుంగీ ధరించిన వారంతా నేరస్థులేనా? అని ప్రశ్నించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రషీద్‌ అల్వీ. బీజేపీ కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేస్తోందంటూ నిప్పులు చెరిగారాయన. ప్రజలు బీజేపీ వ్యవహరిస్తున్న తీరును అర్థం చేసుకున్నారని, అది తెలిసి అధికార పార్టీ భయపడుతోందన్నారు. ఐదు రోజుల క్రితం కూడా ఇలాంటి వివాదాస్పద కామెంట్సే చేశారు మౌర్య. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్యాంపెయిన్ అంతా మధుర కేంద్రంగా ఉండవచ్చని చెప్పారు మౌర్య. ఎందుకంటే.. శ్రీకృష్ణ జన్మ భూమి వివాదం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. దీనిపై ఇప్పటికే అనేక ఘర్షణలు జరిగాయి. కానీ సమస్యకు ఓ పరిష్కారం మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో ప్రసాద్‌ మౌర్య చేసిన కామెంట్స్.. కొత్త చర్చకు దారి తీశారు. ఇక బీజేపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో తెలియక తలలు పట్టుకుంటున్నాయి ఇతర పార్టీలు. అయితే, ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికలు ముగిసే వరకు మరెన్ని వివాదాస్పద కామెంట్స్‌ వస్తాయో చూడాలి.

Also read:

ATM Charge: ఈ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా..? వచ్చే నెల నుంచి బాదుడే.. బాదుడు..!

Online Payments: ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసేవారికి గూగుల్‌ కీలక ప్రకటన.. ఇక నుంచి ఆ వివరాలు ఉండవు..!

PM Mudra Yojana: ప్రజలకు అండగా నిలుస్తున్న కేంద్ర సర్కార్‌ పథకం.. ఇందులో దరఖాస్తు చేసుకుంటే రూ.10 లక్షల రుణం!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu