ఇదేం ఖర్మ రా సామీ.. వేగంగా వచ్చి మృతదేహాన్ని రోడ్డుపై విసిరేసిన అంబులెన్స్.. వీడియో వైరల్!

ఉత్తరప్రదేశ్‌లో 24 ఏళ్ల యువకుడి మరణించడంతో అతని కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలిసి లక్నో-గోండా రహదారిపై నిరసన తెలిపారు. ఇంతలో ఆ వ్యక్తి మృతదేహాన్ని స్ట్రెచర్ నుంచి కింద పడేశారు. ఈ సంఘటనను ఎవరో కెమెరాలో బంధించారు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ మొత్తం సంఘటనలోని అసలు నిజాన్ని పోలీసులు వెల్లడించారు.

ఇదేం ఖర్మ రా సామీ.. వేగంగా వచ్చి మృతదేహాన్ని రోడ్డుపై విసిరేసిన అంబులెన్స్.. వీడియో వైరల్!
Gonda News

Updated on: Aug 05, 2025 | 1:03 PM

ఉత్తరప్రదేశ్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల యువకుడి మరణించడంతో అతని కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలిసి లక్నో-గోండా రహదారిపై నిరసన తెలిపారు. అదే సమయంలో, వేగంగా వస్తున్న అంబులెన్స్ నుండి స్ట్రెచర్‌తో పాటు మృతదేహాన్ని విసిరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటపడింది. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వేగంగా వైరల్ అవుతోంది.

గోండా దేహత్ కొత్వాలి ప్రాంతంలోని బాల్పూర్ జాట్ గ్రామంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. మరణించిన యువకుడి పేరు హృదయ్ లాల్ అని చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 1న డబ్బుల విషయంలో కొంత మంది యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో అతన్ని తీవ్రంగా కొట్టారు. ఆ యువకుడు ఘర్షణలో గాయపడ్డాడు. చికిత్స పొందుతూ హృదయ్ లాల్ మంగళవారం(ఆగస్టు 5) లక్నోలో మరణించాడు.

దీని తరువాత, యువకుడి మరణ వార్త గ్రామానికి చేరుకోగానే, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, బంధువులు లక్నో-గోండా రహదారిపై ఆందోళనకు దిగారు. ఆ తరువాత, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నించారు. ఇంతలో, లక్నో-గోండా రహదారి నుండి ఒక అంబులెన్స్ మృతదేహంతో వేగంగా వస్తోంది. ఈ అంబులెన్స్‌లో ఉన్నదీ హృదయ్ లాల్ మృతదేహం. ఇంతలో డోరుపై ఒక వ్యక్తి వేలాడుతూ హృదయ్ లాల్ మృతదేహాన్ని స్ట్రెచర్‌తో పాటు రోడ్డుపైకి విసిరేశాడు.

దీని తరువాత అంబులెన్స్ అక్కడి నుంచి అంతే వేగంగా వెళ్లిపోయింది. ఈ మొత్తం సంఘటనను ఎవరో కెమెరాలో బంధించారు. దీని తర్వాత ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రోడ్డుపై పడి ఉన్న మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షాక్ అయ్యారు. దీంతో మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని నియంత్రించారు. ఆ తరువాత మృతదేహాన్ని ఒక చిన్న ట్రక్కులో దహన సంస్కారాల కోసం పంపారు.

దాడి ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, మృతదేహం పడిపోవడంపై ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ సభ్యులే అంబులెన్స్ నుంచి దాన్ని బయటకు తీసినట్లు తేలింది. కొంతమంది బంధువులు ఈ దాడికి పాల్పడ్డారు. మృతదేహాన్ని నేలపై ఉంచి రోడ్డును దిగ్బంధించడానికి ప్రయత్నించారని పోలీసులు పేర్కొన్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..