గాలిలో వైరస్, ఆ తరహా మాస్కులు ధరిస్తే బెటర్, అంటువ్యాధుల నివారణా నిపుణుని సూచన

గాలిలో వైరస్,  ఆ తరహా  మాస్కులు ధరిస్తే బెటర్, అంటువ్యాధుల నివారణా నిపుణుని సూచన
Masks

గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని వార్తలు వస్తున్న వేళ.. దీని నివారణకు  రెండు ఎన్ 95 లేదా కెఎన్ 95 మాస్కులు ధరించడం మంచిదని, అలాగే ప్రతి 24 గంటలకొకసారి వీటిని మారుస్తుండాలని నిపుణులు అంటున్నారు.

Umakanth Rao

| Edited By: Phani CH

Apr 18, 2021 | 2:47 PM

గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని వార్తలు వస్తున్న వేళ.. దీని నివారణకు  రెండు ఎన్ 95 లేదా కెఎన్ 95 మాస్కులు ధరించడం మంచిదని, అలాగే ప్రతి 24 గంటలకొకసారి వీటిని మారుస్తుండాలని నిపుణులు అంటున్నారు. ఈ మేరకు అంటువ్యాధుల నివారణ నిపుణుడు డాక్టర్ ఫర్హీం  యూనస్ తెలిపారు. గాలి  ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపించే సూచనలు ఉన్నాయని లాన్సెట్ స్టడీ తన అధ్యయన పత్రంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి పరిష్కారం రెండు ఎన్ 95 లేదా రెండు కెఎన్ 95 మాస్కులను కొనుక్కుని వాటిని ప్రతి 24 గంటలకొకసారి మారుస్తుండాలి… అవి డ్యామేజీ కానంతవరకు ఇలా కొన్ని వారాల పాటు వినియోగించాలి అని ఆయన వివరించారు. గాలి ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని అంటున్నప్పటికీ దీనివల్ల గాలి కలుషితం కాదని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ లో రీసెర్చర్ అయిన యూనస్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ వైరస్ గాల్లో సస్పెండెడ్ స్థితిలో ఉంటుందని, ఇంటి లోని వాయువులో కూడా ఉండవచ్చునని పేర్కొన్నారు. ఇదే రిస్క్ అని ఆయన తెలిపారు.

అయితే ఆయన మరో కొత్త  విషయం తెలిపారు.  వ్యక్తులు ఆరు అడుగుల దూరంలో ఉన్నప్పుడు మన  పార్కులు లేదా బీచ్ లు ..వారు  మాస్కులు ధరించకుండానే సురక్షితమైనవని వెల్లడించారు. ల్యాబ్ ప్రయోగాల్లో ఈ వైరస్ గాల్లో సుమారు మూడు గంటలు ఉంటుందని తేలినట్టు  బ్రిటన్, అమెరికా, కెనడా దేశాలకు  చెందిన ఆరుగురు నిపుణుల బృందం తెలిపింది.కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రుల ఎయిర్ ఫిల్టర్లు లేదా భవనాల గవాక్షాల్లో కూడా ఈ వైరస్ ఉంటుందని ఈ బృందం అభిప్రాయపడింది. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని వివరించింది. కాగా గాలి ద్వారా  ఈ వైరస్ వ్యాపిస్తుందన్నది గతంలో కూడా వార్తగా వచ్చింది. తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్ల ద్వారా ఇది వ్యాపిస్తుందని  లోగడ మొదట నిపుణులు తెలిపారు. ఇప్పుడు గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుందని లాన్సెట్ స్టడీ తన ప్రయోగాల ద్వారా చెబుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి: Earthquake in Japan and Iran : ఇరాన్ తీర ప్రాంతం, జపాన్‌ లోని మియాగీ ప్రాంతంలో ఆదివారం ఉదయం భూకంపం

రెమ్ డెసివిర్ సప్లయర్ ని పోలీసులు వేధిస్తున్నారు, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu