ఉల్లి ధరలపై చర్చ పక్కదారి పట్టి..

ఉల్లి ధరలపై చర్చ పక్కదారి పట్టి..

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటుండగా.. దీనిపై మంగళవారం పార్లమెంటులో చర్చ మొదట సాదాసీదాగానే మొదలైంది. అంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పక్కదారి పట్టింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశించి కాంగ్రెస్ సభా పక్షనేత అధిర్ రంజన్ చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ మండిపడ్డారు. ఆమెను చౌదరి ‘ నిర్బల ‘ (శక్తిహీనురాలు) అని విమర్శించారని, ఇందుకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నిర్మలా సీతారామన్ ‘ […]

Pardhasaradhi Peri

|

Dec 03, 2019 | 3:02 PM

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటుండగా.. దీనిపై మంగళవారం పార్లమెంటులో చర్చ మొదట సాదాసీదాగానే మొదలైంది. అంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పక్కదారి పట్టింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశించి కాంగ్రెస్ సభా పక్షనేత అధిర్ రంజన్ చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ మండిపడ్డారు. ఆమెను చౌదరి ‘ నిర్బల ‘ (శక్తిహీనురాలు) అని విమర్శించారని, ఇందుకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నిర్మలా సీతారామన్ ‘ నిర్బల ‘ కాదని, నిజానికి మీ కాంగ్రెస్ పార్టీయే ‘ నిర్బల ‘(బలహీనమైన) పార్టీ అని ఆమె దుయ్యబట్టారు. అధిర్ రంజన్ ఓ కుటుంబం (గాంధీ కుటుంబం) కోసం పని చేస్తున్నారు.. అంతే తప్ప దేశం కోసం కాదు ‘ అని పూనమ్ మహాజన్ అన్నారు. ఈ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య మాటల యుధ్ధం తారస్థాయికి చేరుకోవడంతో . చివరకు కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

నేను నిర్మలను.. నిర్మలంగానే ఉంటా.. ‘

లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తనపట్ల చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. తాను  ‘ నిర్బల ‘ ను కానని, తమ పార్టీలో ప్రతి మహిళా సబలేనని అన్నారు. మోదీ ప్రభుత్వంలో మహిళలంతా సబలలే.. (శక్తిమంతులే).. అలాగే బీజేపీలో పంచాయితీ స్థాయి నుంచి జాతీయ కార్యవర్గ స్థాయి వరకు ప్రతి మహిళా సబలే అని ఆమె వ్యాఖ్యానించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu