మామిడి తోట రక్షణకు గార్డులు, కుక్కలు కాపలా ! వింతే మరి ! ఎక్కడంటే …?

మామిడి తోటను దొంగల బారి నుంచి రక్షించుకోవడానికి ఎక్కడైనా సెక్యూరిటీ గార్డులను, కుక్కలను కాపలాగా పెట్టుకుంటారా .? లేదు..కానీ యూపీ ..

  • Publish Date - 6:05 pm, Thu, 17 June 21 Edited By: Phani CH
మామిడి తోట రక్షణకు గార్డులు,  కుక్కలు కాపలా !  వింతే మరి ! ఎక్కడంటే ...?
Expensive Mangoes

మామిడి తోటను దొంగల బారి నుంచి రక్షించుకోవడానికి ఎక్కడైనా సెక్యూరిటీ గార్డులను, కుక్కలను కాపలాగా పెట్టుకుంటారా .? లేదు..కానీ యూపీ ..జబల్పూర్ లోని భార్యాభర్తల జంట మాత్రం ఇదే పని చేసింది. తమ ప్రత్యేకమైన మామిడి తోటను కాపాడుకునేందుకు గార్డులను, కుక్కలను పెట్టుకుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ! ఇందుకు కారణం ఒకటుంది..ప్రపంచంలోనే..అంతర్జాతీయ మార్కెట్ లో అత్యంత ఖరీదైన, అరుదైన వెరైటీ మామిడి పండ్లను వీరు తమ తోటలో పండిస్తున్నారు. రాణి, సంకల్ప్ పరిహార్ అనే ఈ జంట తమకు ఇవి సొమ్ములిచ్చే ”కామధేనువు’ల్లాంటివని అభివర్ణిస్తున్నారు. పరిహార్ అసలు విషయాన్ని వివరిస్తూ.. కొన్నేళ్ల క్రితం తాము రెండు మామిడి మొక్కలను పెంచామని, ఇవి సాధారణ మొక్కలే అనుకున్నామని చెప్పారు. కానీ ఇవి పెరుగుతున్న కొద్దీ మామిడి పండ్లు రూబీ (కెంపు) రంగులోకి మారడాన్ని చూసి ఆశ్చర్యపోయాన్నారు వీటి గురించి ఆరా తీస్తే జపాన్ లో పండించే మియాజాకీ పండ్లని తెలిసిందని…ఈ విధమైన ఫలాలు అంతర్జాతీయ మార్కెట్ర్ లో కేజీ 2 లక్షల 70 వేలకు అమ్ముడు పోయినట్టు గ్రహించామని పేర్కొన్నారు. తాను రైల్లో చెన్నైకి వెళ్తుండగా ఓ వ్యక్తి రెండు మామిడి మొక్కలు ఇచ్చి తోటలో వీటిని పెంచుకోమన్నాడని, అయితే ఇవి మియాజాకీ మొక్కలని ఆ తరువాత తెలిసిందని ఆయన చెప్పారు. కానీ తాము వీటిని దామిని అని వ్యవహరిస్తామని ఆయన చెప్పారు.

గత ఏడాది తమ తోటలోకి దొంగలు చొరబడి కొన్ని మామిడి మొక్కలను దొంగిలించుకుపోయారని , అప్పటి నుంచి ఈ తోటకు గార్డులను, కుక్కలను కాపలాగా పెట్టుకున్నామని ఈ జంట తెలిపింది.ఈ అరుదైన మామిడి పండ్ల గురించ్జి తెలుసుకున్న ఓ వ్యాపారి తాను ఒక్కో పండును 21 వేల రూపాయలకు కొంటానని చెప్పాడని, అలాగే ముంబైకి చెందిన ఓ జువెల్లర్ ఎంత సొమ్మయినా ఇచ్చి తాను కూడా కొంటానని మనుషులను పంపాడని వీరు తెలిపారు. కానీ వీటిని తాము ఎవరికీ అమ్మబోమని కరాఖండిగా చెప్పారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి; Garlic Peels Benefits: వెల్లుల్లి పొట్టును బయటపడేస్తున్నారా ? వెల్లుల్లి పొట్టుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

Fast and Furious: ఎట్టకేలకు సూపర్‌ హిట్ సీరిస్‌ అయిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌ సీరిస్‌కు శుభం కార్డ్.. ( వీడియో )